HYD: నీటి బిల్లులు వన్ టైం సెటిల్మెంట్ OTS కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీతాఫల్‌మండి డివిజన్ కార్పొరేటర్ హేమ సామల అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిల్లుపై అవగాహనకు వెంటనే సీతాఫల్‌మండి వాటర్ వర్క్స్ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఆమె వెంట స్థానిక నేతలు ఉన్నారు.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామం నుంచి ఎస్.యానం ONGC ఆన్‌లోడింగ్ పాయింట్ వరకు క్రూడ్ ఆయిల్ హెవీ లోడ్ ట్యాంకర్ల వెళ్లడం వల్ల రోడ్డు ధ్వంసం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్‌కు చల్లపల్లి సర్పంచ్ ఇసుకపట్ల జయమణి, రఘుబాబు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి అమలాపురంలో కలెక్టర్‌ను కలిసి సమస్యపై వినతిపత్రం అందజేశారు.
WGL: దక్షిణ మధ్య రైల్వేకు ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా అప్ గ్రేడ్ చేయాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ నిర్వహించిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని కోరారు.
KDP: రైల్వేకోడూరు పట్టణం వెంకయ్య స్వామి దేవాలయం దగ్గర నుంచి గుర్రప్పపాలెంకు వెళ్లే దారి నడవడానికి వీలు లేకుండా ఉండడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు జేసీబీతో శుభ్రం చేయించారు. పంచాయతీ సిబ్బంది ఆ ప్రాంతంలో చెత్త డంపు చేయడంతో నడవడానికి వీలు లేకుండా ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ATP: అనంతపురంలో అభివృద్ధి పనులు శర వేగంగా చేపట్టాలని మేయర్ మహమ్మద్ వసీం సలీం అధికారులకు సూచించారు. గురువారం నగరపాలకలోని మేయర్ చాంబర్లో ఉప మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డితో కలిసి ఇంజినీరింగ్ విభాగంతో సమీక్ష నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ అధికారుల బదిలీల వల్ల నగరంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని అన్నారు.
JGL: నవంబర్ 1న కరీంనగర్‌కు తెలంగాణ బీసీ కమిషన్ బృందం వస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం వస్తుందన్నారు. అందరి అభిప్రాయాలను నేరుగా తెలుపవచ్చు.
EG: ప్రైవేట్ స్కూల్స్‌లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు జారీ చేశారు. ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తికి అనుగుణంగా గురువారం కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీతో అడ్మిషన్ కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ATP: యాడికి మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని గురువారం రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రిజిస్ట్రేషన్ చేసిన రికార్డులను పరిశీలించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని రిజిస్టర్‌ను సూచించారు.
కోనసీమ: అఖిల భారత పశుగణన కార్యక్రమంపై పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో అమలాపురం MP గంటి హరీష్ మాధుర్ గురువారం రాత్రి సమావేశం అయ్యారు. పశుగణ రంగంలో మెరుగైన పథకాలకు రూపకల్పన జరుగుతుందన్నారు. రైతులు సహకరించి దీన్ని విజయవంతం చేయాలన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. గోవులను రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
W.G: జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారిగా ఈడబ్ల్యుఎస్‌ఎస్‌బిఎల్ నారాయణను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతన జిల్లా ఏర్పడిన తర్వాత విద్యాశాఖ అధికారిగా వెంకటరమణ పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేపట్టిన తర్వాత అప్పట్నుంచి ఖాళీ ఏర్పడింది. నేడు విడుదలైన విద్యాశాఖ అధికారుల బదిలీలలో జిల్లాకు నారాయణ బదిలీపై వచ్చారు.
ADB: పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. శుక్రవారం ఉ.8 గంటలకు పట్టణంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఔత్సాహికులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
HYD: టోలిచౌకి ఫ్లైఓవర్ సుందరీకరణకు నిధులు మంజూరయ్యాయని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ తెలిపారు. గురువారం నానల్ నగర్ డివిజన్ పరిధిలోని టోలిచౌకి ఫ్లైఓవర్‌ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. త్వరగా పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. స్థానికంగా ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు.
అన్నమయ్య: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గురువారం సాయంత్రం పీలేరులో వృద్ధుల కుటుంబీకులను పరామర్శించారు. రైల్వే ట్రాక్ పై మరణించిన యాసిన్, కిరణ్ వాళ్ల ఇంటి వద్దకు వెళ్లారు. తల్లిదండ్రులతో, బంధువులతో మరణము జరిగిన ఘటన గురించి చర్చించి వాళ్లను ఓదార్చి, ఇటువంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
EG: రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వికాస ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాబ్ మేళాకు 188 అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా వికాస మేనేజర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన 48 మంది అభ్యర్థులకు జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు.
KDP: కడప జిల్లా డీఆర్వో గంగాధర్ గౌడ్ గురువారం బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆయన బాపట్ల డీఆర్వోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీ సీఆర్డీఎలో విధులు నిర్వహిస్తున్న విశ్వేశ్వర నాయుడుని నియమించారు.