ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సర్వీసులను పొడగించాలని కేంద్రం రాజ్యసభలో ‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’ను గతేడాది ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పాసైతే కేంద్రం చేతుల్లోకి పూర్తిగా అధికారాలు వెళ్తాయని.. కాబట్టి బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని మన్మోహన్ను ఆప్ అధినేత కేజ్రీవాల్ కోరారు. దీంతో తొమ్మిది పదుల వయస్సులో ఆయన వీల్ చైర్లో రాజ్యసభకు వచ్చి ఓటేశారు.