SRD: కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం నాయకులు ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించారు. సీపీఎం రాష్ట్ర 4వ మహాసభల కోసం విరివిరిగా విరాళాలు సేకరిస్తున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుండి 28 వరకు నిర్వహించే సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేయాలని గ్రామస్తులను సీపీఎం నాయకులు కోరారు.
చలికాలంలో కొంతమంది శరీర ఉష్ణోగ్రతను పెంచుకునేందుకు వేడి నీళ్లు తాగుతుంటారు. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు వేడి నీటిని తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎసిడిటీ, అల్సర్, కిడ్నీ, గుండె సమస్యలున్న వారు, జ్వరంతో ఉన్నప్పుడు వేడి నీళ్లు తాగకూడదు. గర్భిణుల్లో బిడ్డపై చెడు ప్రభావం పడుతుంది. పొట్టలో ఆమ్లతత్వం పెరిగి జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి గోరువెచ్చని నీటినే తాగాలి.
VZM: పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ వైసీపీ కార్యాలయం నుంచి గజపతినగరం సబ్ స్టేషన్ వరకు పలు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏడీఈకి వినతి పత్రాన్ని అందజేశారు. నాలుగు మండలాల నుంచి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
W.G: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలు మండలం తాడిమళ్ళలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న 5 మంది బాధిత లబ్ధిదారులకు రూ.4.61లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ఈకార్యక్రమంలో తాడిమళ్ళ గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు.
అన్నమయ్య: పీలేరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో పెంచిన ఛార్జీలకు నిరసనగా శుక్రవారం ర్యాలీ చేపట్టారు. అనంతరం తిరుపతి రోడ్డు మార్గం డిఈ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల నడ్డి విరిచి గడిచిన ఆరు నెలలకే ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచడంపై మండిపడ్డారు.
కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సభ్యులు సంతాపం తెలిపారు. రేపు ఢిల్లీ రాజ్ ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మరోవైపు మన్మోహన్ సింగ్ మృతికి 7 రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది.
ఆర్థిక సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్‌ను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ‘RBI గవర్నర్ సహా పలు కీలక పదవుల్లో మన్మోహన్ పనిచేశారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ముఖచిత్రాన్ని మార్చేశారు. విలక్షణ పార్లమెంటేరియన్‌గా సేవలందించారు. ఎన్నో కీలక పదవులు అధిష్టించినా సామాన్య జీవితం గడిపిన మహానేత. దేశం తరపున ఆయనకు నివాళి అర్పిస్తున్నా’ అని తెలిపారు.
BDK: బూర్గంపాడు మండలం సారపాకలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు శుక్రవారం ముళ్లకంచెను అడ్డుగా వేశారని స్థానికులు తెలిపారు. ఈ దేవాలయానికి పుష్కరవనం నుంచి వెళ్లే దారి ఉండగా అటువైపు నుంచి వెళ్లకుండా కంచె వేసి భక్తులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముళ్లకంచెను తొలగించి భక్తులకు దర్శనం కల్పించాలని కోరారు.
మెదక్: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ‘X’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ సింగ్ దూరదృష్టి కలిగిన నాయకుడని ఆయన మరణం దేశానికి తీరని లోటని ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్: రేపు పాపన్నపేటలోని ఏడుపాయల దేవస్థానం నందు వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటలకు దేవస్థానం కార్యాలయం నందు టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నారు. జనవరి 1 2025 నుంచి డిసెంబర్ 31 2025 వరకు దేవాలయంలో కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కు కోసం స్టీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
సంధ్య థియేటర్ ఘటనపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లందరూ తలదించుకొనే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులు సినిమా హీరోలను దేవుళ్లుగా చూస్తారని తెలిపారు. హీరోల పక్కన ఉండే వారు మంచి సలహాలు ఇచ్చి ఉంటే ఈ ఘటన జరిగేదికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
VZM: పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తెగుళ్లు వల్ల, తుఫాన్ ప్రభావం వల్ల వరి, అపరాలు పంటల రైతులు నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం ఈ నష్టం పై సమగ్రంగా పరిశీలించి రైతులను ఆదుకోవాలని కోరారు.
సత్యసాయి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తోంది. పట్టణాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇవాళ ఉదయం వరకు జిల్లాలో 157.2 mm వర్షపాతం నమోదయింది. అత్యధికంగా నల్లచెరువు మండలంలో 26.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కదిరిలో 21, గాండ్లపెంటలో 9.8, ఆమడగూరులో 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
NGKL: కల్వకుర్తి ప్రభుత్వ కూరగాయల మార్కెట్‌ను శుక్రవారం మండల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పండిత్ రావు తనిఖీ చేశారు. మార్కెట్ రికార్డులను పరిశీలించారు. మార్కెట్‌లో రైతులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల అమ్మకంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో రైతులు, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల అమెరికా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘గత రెండు దశాబ్దాల్లో భారత్-అమెరికా సాధించిన ప్రగతికి మన్మోహన్ పునాది వేశారు. ఇరుదేశాల పౌర అణు సహకార ఒప్పందాన్ని బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు ఎల్లవేళలా గుర్తుండిపోతాయి. ఆయనొక గ్రేట్ ఛాంపియన్’ అని పేర్కొంది.