EG: ఏజెన్సీలో మెగా డీఎస్సీకి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువును నేటి వరకు పొడిగించినట్లు, ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం గురువారం తెలిపారు. అభ్యర్థులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. బీఈడీ, డీఈడీ, టెట్, ఉత్తీర్ణత, కుటుంబ వార్షిక ఆదాయం రూ2.50లక్షల కలిగి ఉండి, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవలన్నారు.
NLR: నవంబర్ 9వ తేదీ నుంచి విజయనగరం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం సుభాష్ బాబు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన అండర్-14 వాలీబాల్ బాలికల విభాగంలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు.
కృష్ణ: జనావాసాల చెంతన మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని పరిసర ప్రాంత ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. గురువారం ఘంటసాల గ్రామ పరిధిలోని మల్లంపల్లి రోడ్డులోని పలువురు ఆ ప్రాంతీయులు డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గకు, మొవ్వ ఎక్సైజ్ సీఐ వరాల రాజులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లంపల్లి రోడ్డులో మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు పడతామన్నారు.
SKLM: TDP సోషల్ మీడియా కన్వీనరుగా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె.. బగ్గు అర్చన నియమించబడ్డారు. ఈ మేరకు పోలాకి మండలం కత్తిరివానిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. TDP భావాలను, సమాచారాన్ని మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేసేందుకు తాను సోషల్ మీడియా కన్వీనరుగా బాధ్యతలు తీసుకున్నానని అర్చన తెలిపారు.
NLR: మాజీమంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్‌లు పెడుతున్నారని, నిన్న ముత్తుకూరు మండల టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
JGL: పట్టణం, పరిసర గ్రామాల్లో అమాయక ప్రజల వద్ద చీటీల డబ్బులు తీసుకొని వారిని మోసం చేసి గత రెండు సంవత్సరల క్రితం జగిత్యాల నుండి పారిపోయిన గాండ్ల వెంకన్నను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు జగిత్యాల టౌన్ సీఐ వేణు గోపాల్ తెలిపారు. ఇతడు ఎలాంటి అనుమతి లేకుండా ఫైనాన్స్ పెట్టి డబ్బులు తీసుకుని పారిపోయినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
HYD: MMTS రెండవ దశ పనులు పూర్తి కావడం, చర్లపల్లి టర్మినల్ సిద్ధం కావడంతో కేంద్రం యాదాద్రి రైల్వే లైన్‌పై దృష్టి సారించింది. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నగరం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రికి MMTS అందుబాటులో వస్తే సికింద్రాబాద్ నుంచి 45 నిమిషాల్లో కేవలం రూ. 20 టికెట్‌తోనే చేరుకోవచ్చు.
ELR: జిల్లా విద్యాశాఖ అధికారినిగా వెంకటలక్ష్మమ్మ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం అనకాపల్లి డీఈఓగా పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇక్కడ పనిచేస్తున్న డీఈఓ అబ్రహం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు. త్వరలో వెంకటలక్ష్మమ్మ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
కృష్ణ: ప్రకాశం బ్యారేజీ వద్ద రెయిలింగ్ ఒరగడం, ప్రహరీ దెబ్బతినడంతో సందర్శకులు భయపడుతున్నారు. ఈ ఏడాది బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11.45లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో బ్యారేజీ చుట్టు పక్కల ఉన్న నిర్మాణాలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. సీతానగరం వైపు ఉన్న రక్షణ గోడ నదిలోకి కుంగిపోతుండగా నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు బ్యారేజీ JE తెలిపారు.
TG: HYD శివారులో రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేసే ప్రయత్నం చేసిన కేసులో టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను OU పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఈ కేసులో ఈ నెల 17న శివరామకృష్ణను OU పోలీసులు అరెస్టు చేయగా.. 18న బెయిలు వచ్చింది. 19న విడుదలయ్యారు. బెయిలు షరతుల ప్రకారం పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలనే నిబంధనను ఆయన ఉల్లంఘించడంతో.. పోలీసులు మ...
ప్రకాశం: కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి నడిచి వెళ్తున్న పాదచారుడిని ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ద్విచక్రవాహనదారుడితో పాటు పాదచారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని ఎస్సై వెంకటేశ్వర నాయక్ తన పోలీసు వాహనంలో గిద్దలూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
NDL: మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం ప్యాపిలి మండలానికి రానున్నట్లు వైసీపీ ముఖ్య నాయకులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు మండల పరిధిలోని రామరత్నగిరిలో వైసీపీ నాయకులు, కార్య కర్తలతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.
WGL: రాయపర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జీ. రోహిత, 9వ తరగతి చదువుతున్న టి. స్వాతి లు డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ఇండియా వారు నిర్వహించిన క్విజ్ పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ సముద్రాల సరిత తెలిపారు.
NLR: సంగం బస్టాండ్ సెంటర్లో బెల్ట్ షాప్‌పై ఎస్సై రాజేష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్రమంగా విక్రయిస్తున్న పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. షాప్ నిర్వహిస్తున్న శివయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
PDPL: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ఈ రోజు ( 25న ) బోనస్ఒక్కొక్కరికి రూ. 93,750 చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించిందని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 31న దీపావళి పండుగ ఉన్నందున సింగరేణిలో కార్మికులకు బోనస్ చెల్లించాలని గుర్తింపు సంఘం యాజమాన్యాన్ని కోరిందన్నారు.