AP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘మన్మోహన్ మరణం అత్యంత బాధాకరం. ఆయన మహోన్నత నాయకుడు. భారతదేశ ఆర్థిక శిల్పి. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
WNP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి శుక్రవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, ఉపాధి పథకం, సమాచార హక్కు చట్టం సహా దేశ అత్యున్నత అనేక పదవులు నిర్వహించిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
SRD: పటాన్ చెరు మండలం పోచారం గ్రామ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 6, 7 తేదీలలో జాతర సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
VZM: గజపతినగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి గొప్ప సంస్కరణలు చేపట్టారని కొనియాడారు.
TG: మన్మోహన్ సింగ్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. మన్మోహన్ దేశానికి అందించిన సేవలను భట్టి విక్రమార్క కొనియాడారు. దేశానికి మన్మోహన్ చేసిన అమూల్య సేవలు చిరస్మరణీయమని.. దేశాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అనన్యం అని పేర్కొన్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జవవరి 1 తేదికి సంబంధించిన పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1వ తేది సెలవు దినం కావడంతో డిసెంబర్ 31న (మంగళవారం) పెన్షన్లు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 3,13,255 మంది లబ్ధిదారులకు రూ.128.56 కోట్లు అధికారులు ఖాతాలో జమ చేశారు.
CTR: మైనర్‌ను తీసుకెళ్లిన వ్యక్తిపై ఫొక్సొ కేసు నమోదు చేసినట్లు SI రవి కుమార్ తెలిపారు. పీటీఎం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంటినుంచి వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబీకులు తెలిసిన చోటల్లా వెతికారు. ఆ బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా.. నరసింహులు ఆమెను తీసుకెళ్లినట్లు తేలింది.
వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. నిన్నటితో పోల్చితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరగటంతో రూ.78,000 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.71,500 ఉంది. కాగా.. కిలో వెండి ధర లక్ష రూపాయలు ఉంది.
CTR: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. శుక్రవారం స్థానిక టవర్ క్లాక్ వద్ద భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి, నేడు కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచడం దారుణమన్నారు.
నల్గొండ: 17 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,111 మంది ఉద్యోగులు శుక్రవారం నుంచి సమ్మెబాట పట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. సమగ్ర శిక్షఉద్యోగులు ఇవాళ నుంచి 100% సమ్మెలో పాల్గొంటామని ప్రకటించడంతో విద్యార్థుల పర్యవేక్షణతో పాటు పాఠాలు ఏర్పాట్లు చేసింది.
E.G: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ మంత్రి, యనమల రామకృష్ణుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మేధా సంపన్నుడు, విద్య, పరిపాలనను సమానంగా విస్తరించిన అరుదైన రాజకీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని అన్నారు. ఆర్థిక మేధోసంపత్తితో గాడి తప్పిన భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వైపు నడిపించారని యనమల పేర్కొన్నారు.
NLG: నకిరేకల్ మండలం నోముల మాజీ సర్పంచ్ సోమయ్య అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం సోమయ్య భౌతిక కాయానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
KMM: మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాట్టా రాగమయి అన్నారు. ప్రపంచం గర్వించే ఆర్థికవేత్త, సంస్కరణల రూపశిల్పి, దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప ఆర్థికమేధావి మన్మోహన్ సింగ్ అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
E.G: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆకస్మిక మృతి తీరని లోటని రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పోస్ట్ చేశారు. ఆయనతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. మృధుస్వభావి, ముక్కుసూటి మనస్తత్వం కలిగిన, నిజాయితీపరుడైన గొప్ప రాజకీయవేత్తగా, సరళీకృత విధానాలతో నూతన భారతదేశ నిర్మాణానికి రూపశిల్పిగా నిలిచారని కీర్తించారు. అతని మృతి ప్రతి భారతీయుని హృదయాన్ని కలచివేసిందన్నారు.
W.G: పోలవరం ఏటిగట్టు సెంటర్ బస్టాండ్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి కూటమి పార్టీ నేతలు శంకుస్థాపన చేశారు. మరుగుదొడ్లు లేకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమైంది.