VZM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి తీరని లోటని దేశ రాజకీయాల్లో మన్మోహన్ సింగ్కి ఒక ప్రత్యేకత ఉందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఆత్మకి శాంతి కలగాలని తన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈసందర్బంగా ఢిల్లీలో ఆయనతో సమావేశం మర్చిపోలేని తీపి గుర్తు అన్నారు.