మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల కాంగ్రెస్ నేత శశిథరూర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానిగా మన్మోహన్ చివరి మాటలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ప్రస్తుతం ఉన్న మీడియా, పార్లమెంటులోని ప్రతిపక్షాల కంటే చరిత్ర.. నా పట్ల దయతో ఉంటుందని 2014లో మన్మోహన్ అన్నారు. సరిగ్గా పదేళ్ల తర్వాత అదే నిజమైంది’ అని శశిథరూర్ పేర్కొన్నారు.