KNR: మానకొండూర్ మండలం ఈదెలగట్టపెల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్ పరిశీలించారు. ఆరు వారాలుగా కూలి డబ్బులు రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి, 333 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పనిస్థలాల్లో నీరు, టెంట్, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.
KRNL: ఆదోని ముస్లిం మైనార్టీల సమస్యలను ఎమ్మెల్యే పార్థసారథి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అరేకల్లు వద్ద రూ.18 కోట్లతో నిర్మించిన బాలికల రెసిడెన్షియల్ స్కూల్, రూ.3.69 కోట్ల ఐటీఐ కాలేజ్ వినియోగం లేకుండా ఉన్నాయన్నారు. ఉర్దూ జూనియర్ బాలికల కళాశాల అర్ధాంతరంగా నిలిచిపోయాయని విమర్శించారు. గత ప్రభుత్వం ఈద్గా కోసం రూ.2.60 కోట్లు తెచ్చామని మోసం చేసిందన్నారు.
HNK: రాంపూర్‌లో కనకదుర్గమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేడుకలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాంపూర్ ప్రాంతం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
AKP: రావికమతం మండలం కొమిర గిరిజన రైతులు జీడిపిక్కలకు కిలో రూ.200 మద్దతు ధర నిర్ణయించాలని ఇవాళ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులు జీడితోటలపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా జీడిపిక్కలను కొనుగోలు చేయడంతో పాటు ఉపాధి పనులు, రోడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
HYD: స్వతంత్ర సమరయోధులు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా గురువారం కాచిగూడలోని ఆయన విగ్రహానికి BJP నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతమ్ రావు, మాజీ కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ పిలుపునిచ్చారు.
ADB: ఉట్నూర్ ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డీఈవోగా గోడం చందన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన పార్డీ(బి) గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల పీజీహెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఈ కీలక పోస్టును భర్తీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
TG: ప్రేమ విఫలమై యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుంది. ఈ క్రమంలో కోమలి స్నేహితుడు అఖిల్‌కు పోలీసులు నోటీసులు పంపించారు. నిన్న రాత్రి వరకు అఖిల్‌ను విచారించారు. మళ్లీ విచారణకు పిలిస్తే రావాలని తెలిపారు.
KMM: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి, విక్రయిస్తామని నమ్మబలికిన ముగ్గురు నిందితులను ఖానాపురం హవేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అమాయక ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసి మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా చేతిలో ఎవరైనా మోసపోయి ఉంటే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఖమ్మం CP కోరారు.
KMR: బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రం అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆయనను ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. అనంతరం బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియాలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీఎం శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ మాట్లాడుతూ.. నస్పూర్‌లోని రోడ్లు విస్తరించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, మహా ప్రస్థానం, 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు.
NDL: కోవెలకుంట్ల మండలంలో విద్యుత్ మోటార్లు ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ చోరీలు పెరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ నది వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం చేసి 50 కిలోల కాపర్ వైర్ ఎత్తుకెళ్లినట్లు సీఐ హనుమంతు నాయక్ వెల్లడించారు. ఈ దొంగతనాల పట్ల నిఘా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం హిందూ, కొడవ సంప్రదాయాల్లో ఘనంగా జరుగుతోంది. ఈ రోజు ఉదయం హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక ముగియగా, సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారం ప్రకారం ‘కొడవ’ సంప్రదాయంలో మరోసారి వివాహం జరగనుంది. ఈ కొత్త జంట వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
AKP: దేశంలోనే మొట్టమొదటి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. గురువారం శాసనసభలో మంత్రి మాట్లాడుతూ.. దీని ద్వారా లక్షలాదిమందికి ఉపాధి కలుగుతుందన్నారు. నక్కపల్లి మండలంలో వచ్చే నెల 7వ తేదీన ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద గల ఈవీఎం గోదామును కలెక్టర్ N.ప్రభాకరరెడ్ది తనిఖీ చేశారు. నెల వారీ తనిఖీలో భాగంగా ఇవాళ ఆయన గోదాములను సందర్శించారు. గోదాములకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో DRO హేమలత, తదితరులు పాల్గొన్నారు.
ATP: జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటూ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో 2026-27 సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. తొలి విడతలో 607 కార్డులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.