WGL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ పోర్టల్‌లో ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 28వ తేదీ చివరి గడువు అని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KMM: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
SRD: కంగ్టి మండలం రాసుల్ గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు భూ హద్దుల సర్వే గ్రామసభ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ముగ్నీ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి హాజరవుతున్నట్లు తెలిపారు. కావున గ్రామ ప్రజలు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
AP: నెల్లూరు నగరపాలిక మేయర్ పదవికి జరిగిన ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అభ్యర్థిత్వానికి మరెవరూ పోటీ లేకపోవడంతో దేవరకొండ సుజాత మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి జేసీ వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ ఎన్నిక ప్రక్రియకు వైసీపీ కార్పొరేట్లు ఎవరూ హాజరుకాలేదు.
ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయనను వికారాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆసిఫాబాద్‌లో తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన, త్వరలోనే వికారాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సమన్వయంతో అభివృద్ధికి సహకరించాలని కోరారు.
BHPL: మల్హర్ రావు మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనుల డేంజర్ జోన్‌లో నివసిస్తున్న భూనిర్వాసితుల సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు తీసుకున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో సచివాలయంలో జరిగిన సమావేశంలో జెన్కో సీఎండీ ఎన్.హరీశ్ భూమి సేకరణ, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న బాధితుల్లో ఆనందం వ్యక్తమైంది.
KRNL: అసెంబ్లీ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్లో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గాయపడ్డారు. ప్రత్యర్థి జట్టు ప్లేయర్లను పట్టుకునే ప్రయత్నంలో ఆయన కిందపడటంతో పాదం భాగంలో గాయమైంది. బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయాన్ని గుర్తించారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆయనకు గాయం కావడంతో తోటి ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
సహజమైన పూలతో చర్మ సౌందర్యాన్ని సులభంగా పెంచుకోవచ్చు. కలువ రేకులు, పాలు కలిపిన పేస్ట్ ముడతలను తగ్గిస్తుంది. గులాబీ రేకలు, శనగపిండి మిశ్రమం ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది. మల్లెపూల పేస్ట్‌తో మర్దనా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. రసాయనాలకు దూరంగా ఉంటూ, ఈ పూల చిట్కాలతో ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. ప్రకృతి సిద్ధమైన ఈ పద్ధతులు చర్మానికి సురక్షితం.
TPT: అన్నా క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించాలని, నగరపాలక కమిషనర్ ఎన్. మౌర్య, సిబ్బందిని ఆదేశించారు. ఒక్కొక్కరు ఒక్క టోకెన్ మాత్రమే తీసుకోవాలని సూచించారు. వచ్చేవారికి నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని తెలిపారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని తెలిపారు.
RR: ఇబ్రాహీంపట్నానికి చెందిన సురేశ్ బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతాజీ సుభాష్ సదర్న్ సెంటర్‌లో డిసెంబర్ 2025- జనవరి 2026 మధ్య నిర్వహించిన ఎన్‌ఐఎస్ (ఖో-ఖో) కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణ నుంచి పాల్గొన్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
తిరుపతి జిల్లా, సత్యవేడు పంచాయతీ పరిధిలోని కోమటి గుంటలో నడుస్తున్న సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ ద్వారా వెదజల్లుతున్న దుమ్ము ధూళి, రసాయన వ్యర్ధాల కాలుష్యంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. కాలుష్యం నుంచి తమను కాపాడాలని కోరుతూ గురువారం కోమటిగుంట వాసులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
SRCL: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఐఏఎస్ బదిలీలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమ అగ్రవాల్, ఐఏఎస్ (2019) నియమితులయ్యారు. ప్రస్తుతం అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో పరిపాలన మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
TG: వరంగల్ జిల్లా కోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. . అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాల నుంచి జడ్జీలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించి బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. కాగా గత కొన్ని రోజులుగా పలు చోట్ల బాంబులు పెట్టినట్లు వార్తలు రావడం కలకలం రేపుతున్నాయి.
NLG: రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంపై అధికారులు ముస్లిం పెద్దలతో ఇవాళ నకిరేకల్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష జరిపారు. సోదర భావంతో శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగేందుకు అధికారులు ముస్లిం సోదరులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
BHNG: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. భువనగిరి కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనను దేవదాయ శాఖ డైరెక్టర్ నియమించింది. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగానూ అపాయింట్ అయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించిన హరీష్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.