• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్షా కేంద్రాలు పరిశీలించిన ఎస్పీ

SRD: సంగారెడ్డి పట్టణంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ పారితోష్ పంకజ్ బుధవారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు.

February 25, 2026 / 03:42 PM IST

రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేయాలంటూ 27న నిరసన

కడప నగరంలోని ఎర్రముక్కపల్లి–విశ్వనాధపురం మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఈనెల 27న నిరసన ప్రదర్శన చేపట్టనుంది. ఉదయం 10 గంటలకు విశ్వనాధపురం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగేళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిధుల విడుదలలో జాప్యంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

February 25, 2026 / 03:41 PM IST

తండాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు: MLA

JN: తండాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలంలోని పలు తండాలలో ఎమ్మెల్యే పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గతంలో అధికారంలో ఉన్న వారు తండాలను పట్టించుకోలేదని, తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు.

February 25, 2026 / 03:40 PM IST

యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయి: మంత్రి

AP: రాష్ట్రంలో 970 కి.మీ. తీర ప్రాంతం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఏపీలో బీచ్ శాండ్ మినరల్స్ కారణంగా.. యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. గత ప్రభుత్వంలో మైనింగ్‌ను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. మైనింగ్ సొంత జాగీరులా వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు.

February 25, 2026 / 03:40 PM IST

గ్రామాల అభివృద్ధిలో GP పాత్ర కీలకం: ఆడే గజేందర్

ADB: గ్రామాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ పాత్ర కీలకమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బుధవారం మండలంలోని సాంగ్వి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థానికులతో కలిసి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీలోనే గ్రామాల అభివృద్ధి చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. మండల నాయకులు, మహిళలు తదితరులున్నారు.

February 25, 2026 / 03:40 PM IST

జడ్చర్ల కరాటే బెల్ట్ గ్రేడింగ్

MBNR: జడ్చర్ల మండలంలోని గంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు విజయవంతంగా నిర్వహించారు. ఈ టెస్టులో సాత్విక్ మెరూన్, జ్యోత్స్న, యశ్వంత్ బ్లూ, వర్ష, సారిక, రామ్ సాయి, మానస్, జస్వంత్ ఆరెంజ్, అనిల్, వరుణ్ ఎల్లో బెల్టు సాధించినట్లు అకాడమీ ఫౌండర్ మాస్టర్ కేశవ్ గౌడ్ తెలిపారు.

February 25, 2026 / 03:40 PM IST

ఇంటర్ విద్యార్థులకు మనోధైర్యం కల్పించిన ప్రజాప్రతినిధులు

NRPT: ఇంటర్మీడియట్ విద్యార్థులు భయాందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఊట్కూర్ ఉప సర్పంచ్ ఆర్. రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్ అన్నారు. బుధవారం ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు మనోధైర్యం ఇచ్చి, ఆందోళన లేకుండా శ్రద్ధగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

February 25, 2026 / 03:40 PM IST

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా లింగాపూర్ వాసి

JGL: నిజామాబాద్లో ఇటీవల జరిగిన ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల్లో పెగడపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన రాకేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం నుంచి ఆయనను ఈ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ రంగరాజన్ తెలిపారు. ఈ సందర్భంగా లింగాపూర్ సర్పంచ్ వీరేశం, గ్రామస్థులు రాజేష్‌ను అభినందించారు.

February 25, 2026 / 03:40 PM IST

లుకౌట్ నోటీసు అంటే ఏమిటో తెలుసా?

నేరం చేసి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న వ్యక్తి, దేశం విడిచి పారిపోకుండా అడ్డుకోవడమే ఈ నోటీసు ప్రధాన ఉద్దేశ్యం. దర్యాప్తు సంస్థల విన్నపం మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులు దీనిని జారీ చేస్తారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దుల్లో ఈ వివరాలు ఉంటాయి. నిందితుడు ఎయిర్‌పోర్టులో కనిపిస్తే వెంటనే అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగిస్తారు.

February 25, 2026 / 03:38 PM IST

పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు

RR: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షాద్‌నగర్, మొయినాబాద్, మహేశ్వరం డివిజన్లకు చెందిన డీసీపీ పరీక్ష కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని కేంద్రాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని అధికారులు తెలిపారు.

February 25, 2026 / 03:38 PM IST

నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందజేత

MDK: నార్సింగి మండలం శంకాపూర్ తండాలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద వధువుకు పుస్తె మట్టెలను సర్పంచ్ మహేందర్ సింగ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సంతోషమే తన సంతోషమని తండాలో ఉన్న ఆడబిడ్డలు తమ తో బుట్టువులని, వారికి సేవచేయడంలో ఉన్న ఆనందం మరోకటి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్ పాల్గొన్నారు.

February 25, 2026 / 03:38 PM IST

చెత్త తొలగించాలని స్థానికుల ఆందోళన

MDCL: అల్వాల్ సర్కిల్ ఇందిరా గాంధీ విగ్రహం చౌరస్తా సమీపంలోని హనుమాన్ దేవాలయం ఎదురుగా, లైబ్రరీ పక్కన చెత్త వేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రజలు చెత్తలో కూర్చొని నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు చెత్త ఉన్న స్థలాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక కాలనీవాసులు డిమాండ్ చేశారు.

February 25, 2026 / 03:37 PM IST

తిరుపతిలో మహిళ, బాలిక అదృశ్యం

తిరుపతిలోని ఆటోనగర్‌కు చెందిన అశాలత, ఆమె మనవరాలు దుర్గా అదృశ్యమైనట్లు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ తిరిగి రాలేదని తల్లి నాగరత్నం ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

February 25, 2026 / 03:37 PM IST

‘సోలార్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలి’

NDL: జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ జీ. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూఫ్‌టాప్ సోలార్ (RTS) ప్లాంట్ల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణ సౌకర్యాల వివరాలను స్పష్టంగా తెలపాలన్నారు.

February 25, 2026 / 03:36 PM IST

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 50.15 పాయింట్లు లాభపడి 82276.07 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57.85 పాయింట్ల లాభంతో 25482.50 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.95గా ఉంది.

February 25, 2026 / 03:36 PM IST