• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైఎస్ జగన్‌కు పాపం ఊరికే పోదు: బక్కని

RR: తిరుమల పవిత్ర లడ్డు కల్తీ చేశారని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు అన్నారు. ఇవాళ షాద్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ మహా పాపం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఊరికే వదిలిపెట్టదని, తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదన్నారు. దాదాపు 20 కోట్ల కల్తీ లడ్డూలను భక్తులకు పంపిణీ చేసి హిందువుల విశ్వాసాలతో ఆడుకున్నారన్నారు.

February 25, 2026 / 03:35 PM IST

మార్కాపురానికి బయలుదేరిన CM చంద్రబాబు

ప్రకాశం: దోర్నాల మండలం గంటవానిపల్లి వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ను సందర్శించిన అనంతరం హెలిప్యాడ్‌లో మార్కాపురానికి బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని తర్లుపాడు రోడ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారి రావడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

February 25, 2026 / 03:35 PM IST

వార్డు సభ్యులకు కొనసాగుతున్న అవగాహణ

NZB: దర్‌పల్లి మండలంలోని అన్ని గ్రామాల ఊసర్పంచ్, వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా ఎంపీడీవో కాయలయ్య సమావేశపు గదిలో అధికారులు పంచాయతీల్లో జరిగే కార్యక్రమాలకు చట్టాలపై అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో అన్నిగ్రామాల ఊసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 25, 2026 / 03:35 PM IST

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 175 దుకాణాలు ఉన్న భవన సముదాయంలో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తున్నారు. నగరంలోని చిక్కపేట పరిధిలోని కుంబారపేటలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 03:34 PM IST

కాలువ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

JN: నర్మెట్ట మండలం హనుమంతపురం వద్ద బొమ్మకూరు ఎడమ ప్రధాన కాలువ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. కాలువలో ఉన్న పూడిక, చెట్ల తొలగింపు పనులను వారం రోజులలో పూర్తి చేసి మంగలి బండ తండా వరకు సాగు నీరు అందించాలని అధికారులను ఎమ్మెల్యే కడియం ఆదేశించారు.

February 25, 2026 / 03:34 PM IST

జగన్‌పై మంత్రి ఆనం ఆగ్రహం

AP: వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఐదేళ్లలో ప్రజలపైనే కాదు ఆలయాలపైనా దాడులు జరిగాయి. రామతీర్థం మొదలు దుర్గమ్మ ఆలయం వరకు.. అన్ని ఆలయాల్లో ఎన్నో అపచారాలు చేశారు. మేం వచ్చాక ఆలయాల్లో రాజకీయ ప్రమేయం తగ్గించాం. ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు చేయిస్తున్నాం. దేవాదాయశాఖలో ఇచ్చిన 98 శాతం హామీలు అమలు చేశాం’ అని పేర్కొన్నారు.

February 25, 2026 / 03:33 PM IST

ఉర్దూ పాఠశాలలో ‘ధైర్య స్పర్శ’పై అవగాహన కార్యక్రమం

CTR: పలమనేరు ఎస్సై స్వర్ణ తేజ ఉర్దూ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో “ధైర్య స్పర్శ”, మహిళలపై నేరాలు, మహిళా భద్రతా చర్యలు, డయల్ 112 అత్యవసర సేవల వినియోగం, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

February 25, 2026 / 03:32 PM IST

మహిళా విభాగం అధ్యక్షురాలుగా సునీత

BHPL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేగొండ మండలం మహిళా విభాగం అధ్యక్షురాలుగా సాదు అనితను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు రవిపటేల్ తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని నూతన అధ్యక్షురాలికి జిల్లా అధ్యక్షులు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల నేతలు పాల్గొన్నారు.

February 25, 2026 / 03:32 PM IST

జిల్లాలో 12 మంది వైద్యులపై వేటు

KNR: జిల్లాలో విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ డీఎంఈ నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 12 మంది ఉన్నారు. NTPC డా.మంజుల,నిఖిల్, ప్రదీప్, వినయ్, అనుష, స్వాతి, సాయికిరణ్, స్ఫూర్తిరావు, KNR డా. సింధు, హిమజ, SRCL డా.పర్వీన్ ఫాతిమా, రవికుమార్లు ఏడాదికి పైగా విధులకు రానందుకు తొలగించారు.

February 25, 2026 / 03:31 PM IST

యాదాద్రిని దర్శించుకున్న మంత్రి పొన్నం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా బుధవారం బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పాల్గొన్నారు

February 25, 2026 / 03:31 PM IST

వేటపాలెం పీహెచ్‌సీ అభివృద్ధికి దాతల తోడ్పాటు

BPT: వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు ఆర్థిక సాయం అందించారు. ఆసుపత్రి వైద్యురాలు స్వాతికిరణం విజ్ఞప్తి మేరకు, రోగుల కోసం కుర్చీలు (బల్లలు), మందుల బీరువా కొనుగోలు నిమిత్తం రూ. 23,100 చెక్కును బుధవారం సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా దాత సేవలను వైద్య సిబ్బంది అభినందించారు.

February 25, 2026 / 03:31 PM IST

గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగాలు అత్యంత కీలకం

NTR: విజయవాడలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన “బీచ్ శాండ్ మినరల్స్ టు టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పై జరిగిన వర్క్‌షాప్‌లో మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలోని బీచ్ సాండ్ ఖనిజాలు కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాకుండా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగాలు అత్యంత కీలకమని తెలిపారు.

February 25, 2026 / 03:30 PM IST

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MHBD: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అర్హులైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మురళినాయక్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలన్నారు.

February 25, 2026 / 03:30 PM IST

‘దివిసీమ అభివృద్ధి ప్రదాత ఎంవీ కృష్ణారావు’

కృష్ణా: దివిసీమ అభివృద్ధి ప్రదాత ఎంవీ కృష్ణారావు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. బుధవారం అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి నాగాయలంక మండలం టీ.కొత్తపాలెం కూటమి నాయకులు నివాళులు అర్పించారు.

February 25, 2026 / 03:30 PM IST

వేములవాడలో యాంకర్ సుమ

SRCL: ​ప్రముఖ యాంకర్ సుమ కనకాల బుధవారం వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆమె శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం సుమ కోడె మొక్కును సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి, వేద మంత్రాలతో ఆశీర్వచనం గావించారు.

February 25, 2026 / 03:29 PM IST