• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బాల్య వివాహాలు చేస్తే జైలుకే’

PPM: జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్టు సమాచారం తెలిస్తే జరిపించిన తల్లిదండ్రులతో పాటు గ్రామ సర్పంచ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్య వివాహాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

February 26, 2026 / 04:37 PM IST

‘జనసేన బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం’

SKLM: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు సభ్యత్వ విధానాన్ని ప్రవేశపెట్టిందని జనసేన పార్టీ నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గేదెల చైతన్య అన్నారు. శ్రీకాకుళంలో జనసేన సభ్యత్వ నమోదుకి గురువారం శ్రీకారం చుట్టారు. పార్టీని బ‌లోపేతం చేసి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు యువత చేపట్టాలన్నారు.

February 26, 2026 / 04:36 PM IST

పత్తా లేని చెత్త సేకరణ రిక్షాలు..!

SRD: మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామంలో చెత్త సేకరణ రిక్షాలు కనిపించడం లేదని గ్రామస్థులు తెలిపారు. గత స్పెషల ఆఫీసర్ పానలలో పంచాయతీ అధికారులు చెత్త సేకరణ రిక్షాలను స్క్రాప్‌లో విక్రయించినట్లు చెప్పారు. జీపీకి ట్రాక్టర్ రాకముందు రిక్షాలోనే తీసుకెళ్లేవారు. ట్రాక్టర్ వెళ్లని వీధుల్లో రిక్షా ద్వారా చెత్త సేకరణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

February 26, 2026 / 04:35 PM IST

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం

MBNR: కొత్తకోట మండలం చర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి (జీయంఆర్) పాల్గొన్నారు. లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమన్నారు. మొదటి విడతలో మంజూరైన ఇండ్లలో 70% పూర్తయ్యాయని ఆయన తెలిపారు.

February 26, 2026 / 04:33 PM IST

​కొండమల్లేపల్లిలో నగదు చోరీ.. దొంగ అరెస్ట్

NLG: ​కొండమల్లేపల్లి వాసవి బజార్‌లో తాళం వేసిన నాగరాజు ఇంట్లో రూ.67,000 నగదు దొంగిలించిన నిందితుడు బాబాను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.50,000 స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ నవీన్ కుమార్, ఎస్సై రమేష్‌లను డీఎస్పీ అభినందించారు.

February 26, 2026 / 04:33 PM IST

మెడికల్ ఎక్స్పోను సందర్శించిన కలెక్టర్

గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య విజ్ఞాన ప్రదర్శనను గురువారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. ప్రదర్శన ఏర్పాటు పట్ల వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ను అభినందించారు. ఎంతో విజ్ఞానదయంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తిలకించదగినదని చెప్పారు. విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగిస్తుందన్నారు.

February 26, 2026 / 04:33 PM IST

వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు

AP: వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో వైసీపీ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు కూడా జరగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు.

February 26, 2026 / 04:32 PM IST

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమా?: KTR

TG: ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూములపై ముగ్గురు మంత్రుల కన్ను పడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా అని విమర్శించారు. పట్టాలు సక్రమమే అని .. కాంగ్రెస్ నేతల బుద్ది వంకర ఉందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఇళ్ల కూల్చివేతలపై చర్చిస్తామన్నారు.

February 26, 2026 / 04:31 PM IST

‘అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి’

అనంతపురం: అగ్రిగోల్డ్ బాధితులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

February 26, 2026 / 04:30 PM IST

నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ధర్మకర్తలు, అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని మానకొండూర్ MLA డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. గురువారం శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకొని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్మించిన ప్రహారీ గోడను ప్రారంభించారు.

February 26, 2026 / 04:30 PM IST

పన్ను వసూళ్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం వసూళ్ల ప్రక్రియను పరిశీలించారు. గ్రామాభివృద్ధికి గ్రామపంచాయతీకి చెల్లించే పన్నులు ప్రధాన ఆదాయ వనరులు అని ఎంపీడీవో తెలిపారు. గ్రామంలో శుభ్రత, వీధి దీపాలు,తాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఇంటి పన్ను చెల్లించాలన్నారు.

February 26, 2026 / 04:27 PM IST

నేటి ఇంటర్ పరీక్షకు 338 మంది గైర్హాజరు

ATP: జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 20,855 మంది విద్యార్థులకు గాను 20,517 మంది హాజరుకాగా, 338 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా విభాగంలో 1,931 మందికి 1,901 మంది హాజరయ్యారని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు.

February 26, 2026 / 04:26 PM IST

కంభంలో స్మశాన వాటికలకు నేమ్ బోర్డులు ఏర్పాటు

ప్రకాశం: కంభం పట్టణంలోని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో పలు స్మశాన వాటికలకు నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ముస్లిం యూత్ సభ్యులు తెలిపారు.

February 26, 2026 / 04:26 PM IST

‘ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ దాడులు సిగ్గు చేటు’

కోనసీమ: ఏపీ శాసన మండలిలో గురువారం బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని కొత్తపేటకు చెందిన బీజేపీ రాష్డ్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం దుయ్యబట్టారు. సీనియర్ సభ్యుడిపై దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు. ప్రజలు వైసీపీ పార్టీకి చరమగీతం పాడిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు.

February 26, 2026 / 04:25 PM IST

‘తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి’

ATP: గుంతకల్లు మున్సిపల్ నాన్ పీహెచ్ వర్కర్స్‌తో మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ గురువారం సమావేశం నిర్వహించారు వేసవి కాల దృశ్య సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లోని ఫిల్టర్ బ్లేడ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. పట్టణంలో పైప్లైన్ లీకేజీలు, పైప్ లైన్ లలో మురుగునీరు చేరి కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 26, 2026 / 04:24 PM IST