KMR: పల్వంచ మండలానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యాశ్రీ జిల్లా స్థాయి బయోసైన్స్ టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచింది. కామారెడ్డిలో నిర్వహించిన పరీక్షలో మొత్తం 97 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యాశ్రీని జిల్లా విద్యాధికారి రాజు, మెమెంటోతో సత్కరించినట్లు ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలలో వివిధ కేసులు పట్టుబడిన వాహనాలకు గాను గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో వేలం వేయనన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్రభుత్వం నిర్దేశించబడిన ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలం పాటలు పాల్గొనవచ్చు అని వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 79.59 పాయింట్లు లాభపడి 82355.66 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35.85 పాయింట్ల లాభంతో 25518.35 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.87గా ఉంది.
NTR: విజయవాడలో AB కన్వీన్షన్ ఫంక్షన్ హాల్‌లో ఈరగాబి రమణారావు కుమార్తె, వివాహ రీసెప్సషన్ కార్యక్రమంలో నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ASR: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి విజయవాడ ప్రసాదంపాడు వాస్తవ్యులు గంధం రాజేష్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.5,00,001 విరాళాన్ని గురువారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ATP: పామిడి శ్రీ భోగేశ్వర స్వామి ఆలయంలో భక్తాదులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను బుధవారం లెక్కింపు చేశారు. ఆలయ ఈవో కృష్ణయ్య మాట్లాడుతూ.. గత ఏడాది మార్చి 28 నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 25 వరకు భక్తాదులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను లెక్కించగా రూ.1,58,811నగదు,3 గ్రాముల బంగారం, 94 గ్రాముల వెండి వచ్చిందని వారు మీడియాకు తెలిపారు.
NZB: డ్రంక్&డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో వేంపల్లికి చెందిన అదిగేమ్ రాజేశ్వర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. బుధవారం నిందితుడిని ఆర్మూర్ జేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్ భవ్యశ్రీ ఎదుట హాజరుపరచగా,ఐదు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
నటి దివ్య శ్రీపాద, అభయ్ నవీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిన్న బడ్జెట్ రొమాంటిక్ డ్రామా ‘చరిత కామాక్షి’. 2021లో ప్రకటించిన ఈ చిత్రం ద్వారా శ్రీలంక చందు సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘’ఈటీవీ విన్’లో మార్చి 5, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా బదిలీ చేయగా, జిల్లాలో తన పదవీ కాలంలో సమర్థవంతంగా సేవలు అందించిన ఫైజాన్ అహ్మద్, త్వరలోనే కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.
SKLM: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని నరసన్నపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బలగ ప్రవీణ్ తెలిపారు. గురువారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. గతంలో 3300 సభ్యత్వాలు నమోదు చేశామన్నారు. అధినేత ఆదేశాల మేరకు మార్చి పదో తేదీ లోగా 10 వేల సభ్యత్వాలు లక్ష్యంగా చేసుకోవడం జరిగిందని వివరించారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో 150మంది పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, ఎస్టీఎఫ్, స్పెషల్ పార్టీ సిబ్బందితో రంగంలోకి దిగారు. కాట్లాటపల్లి, రోడ్డు, రామిరెడ్డిలేఔట్లో ప్రతి ఇంటిని పరిశీలించారు. 20 బైక్లను సీజ్ చేశారు.
KRNL: అస్వస్థతతో మృతి చెందిన గుర్తుతెలియని అనాధ వ్యక్తికి పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు మానవతా దృక్పథంతో అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. ఎమ్మిగనూరు (మం) గోనెగండ్ల బైపాస్ రోడ్ హిందూ స్మశాన వాటికలో పూలమాలలు వేసి అంతక్రియలు పూర్తి చేశారు. సింగనేటి నరసన్న మహారాజ్ ఆధ్వర్యంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో డీలక్స్ బస్సులు, ఈ-మెట్రో AC సర్వీసుల్లో టికెట్ ధరలను తగ్గిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 1 నుంచి మే ఆఖరు వరకు తగ్గింపు ధరలు అమల్లో ఉండనున్నాయి. మెట్రో డీలక్స్ బస్సులో గతంలో 4 కి.మీల ప్రయాణానికి రూ.30 ఛార్జీ ఉండగా.. ప్రస్తుతం రూ.25కి తగ్గింది. అదే దూరానికి ఈ-మెట్రో AC సర్వీసులో గతంలో రూ.35 ఉండగా రూ.25కి తగ్గించారు.
TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అసెంబ్లీ క్రీడా పోటీల్లో క్యారమ్స్ విజేతగా నిలిచారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన క్యారమ్స్ సింగిల్స్ పోటీల్లో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అత్యంత ప్రతిభ కనబరచి విజేతగా నిలిచారు.
GDWL: ఇటిక్యాల మండలంలో పంచాయతీల బకాయిలు విడుదలకావడంతో క్రిత సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను నెట్టుకుంటున్నారు. 32 గ్రామాలు ఉన్న మండలంలో ఒక్కో పంచాయతీకి సుమారు రూ.20–25 లక్షల బకాయిలు రావాల్సినప్పటికీ, పారిశుద్ధ్య, సీసీ రోడ్, ట్రాక్టర్ పనులకు ఖర్చు చేసిన పెండింగ్ బిల్లులు ఇంకా రావడం లేదని అధికారులు, సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.