AP: శాసనసభ బడ్జెట్ సమావేశాలు 11వ రోజుకు చేరుకున్నాయి. గత పది రోజులుగా వివిధ ప్రజా సమస్యలు, బడ్జెట్ పద్దులపై వాడీవేడీ చర్చలు సాగాయి. ఇవాళ ముఖ్యంగా టీటీడీ కల్తీ లడ్డూ అంశంపై మండలిలో చర్చ జరగనుంది. ఈ వ్యవహారంపై మండలిలో ప్రత్యేక చర్చ జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
NTR: విజయవాడలోని హోటల్ వివాంతాలో ఏపీ రాష్ట్రానికి సంబంధించి భూగర్భ జలాల డేటా ఆక్సిఫర్ మ్యాపింగ్ ఫలితాల ప్రచారంపై వర్క్ షాప్ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ వాటర్ బోర్డ్ సభ్యుడు వరదరాజ్ మాట్లాడుతూ.. భూగర్భ జలాల వనరుల అంచనా, సువర్ణ నిర్వహణ వినియోగానికి కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పద్ధతులను విస్తారంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కడప YVUలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ.టి.శ్రీనివాస్ తెలిపారు. AP నైపుణ్యాభివృద్ధి సంస్థ, YVU ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. పూర్తి సమాచారం కోసం 6300125455, 94405 16153 నంబర్లలో సంప్రదించాలన్నారు.
PPM: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ క్లినిక్‌లు ప్రారంభం కావాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. ఇకపై ప్రతీ గురువారం VROలు ఆయా గ్రామాల్లో రెవిన్యూ క్లీనిక్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రజల రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
RR: మూసీ ప్రాజెక్టులో గృహాలు కోల్పోతున్న బాధితులకు బాసటగా నిలిచే క్రమంలో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రానున్నారని బీజేపీ నార్సింగి సర్కిల్ అధ్యక్షుడు నగేష్ యాదవ్ తెలిపారు. పరామర్శ యాత్ర బాపూఘాట్‌లో మొదలవుతుందన్నారు. టిప్పుఖాన్ బ్రిడ్జ్, గంధంగూడ మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు గండిపేటకు ఆయన చేరుకుంటారని వివరించారు.
అనకాపల్లి మండలం కొత్తూరులో భగవాన్ అవతార్ మెహర్ బాబా 132వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మెహర్ బాబా మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మెహర్ బాబా భక్తురాలు మాజీ ఎంపీపీ గంగుపాం జలజ మాట్లాడుతూ.. ప్రేమ, సేవలతో లోక శాంతిని పొందవచ్చునని భగవాన్ అవుతారు మెహర్ బాబా సూచించారని పేర్కొన్నారు.
W.G: ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన క్రీడోత్సవాల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు క్రికెట్ టీంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఆడి తన ప్రతిభను చూపారు.
MBNR: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామం మల్లన్న ఆలయంలో రెండు నెలల పసి పాపను, ఆ గ్రామ సర్పంచ్ కాలితో తన్నడంతో పాప మరణించింది. ఆ పాప ఆత్మకు శాంతి చేకూరాలని జడ్చర్ల మండలం ఉదండపూర్ గ్రామంలో స్వామి వివేకానంద యువ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.
VKB: బషీరాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరింది. ప్రతిష్టాత్మకమైన హుబ్లీ ఎక్స్‌ప్రెస్ ఇకపై బషీరాబాద్ స్టేషన్‌లో నిలపడానికి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసింది. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. దీంతో బషీరాబాద్ పరిసర గ్రామాల ప్రజలు, వ్యాపారులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది.
HYD: సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరిట భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు. సైబర్ నేరాలకు వేదికగా మారుతున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాల లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పోలీస్ యూనిట్లు, కమిషనరేట్లతో సమన్వయం చేసుకుంటూ నేరాలతో సంబంధం ఉన్న వేలాది అనుమానాస్పద ఖాతాలను గుర్తించారు.
MDK: పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
JGL: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 2వ ఎడిషన్ సీఎం కప్-2025లో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించారు. పాల్గొన్న వారు కబడ్డీ, ఖో-ఖో, యోగ, బాస్కెట్బాల్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జిమ్నాస్టిక్స్ క్రీడల్లో రాణించారు. బాస్కెట్బాల్, ఖో-ఖోలో కాంస్యాలు, బాక్సింగ్, యోగ, జావెలిన్ త్రో, కిక్ బాక్సింగ్లో రజత పతకాలు దక్కాయి. వారిని కలెక్టర్ అభినందించారు.
SRCL: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని, ఆ ఘటనలో రెండేళ్ల చిన్నారి మృతి చెందడాన్ని బీసీ సాధికారిత సంఘం తీవ్రంగా ఖండించింది. బుధవారం వేములవాడలోని సంఘం కార్యాలయంలో మృతి చెందిన చిన్నారికి సంతాపం ప్రకటించారు. ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.
TPT: మామిడి పంట పూత నుంచి పిందెకు మారుతున్నందున, నిమ్మకాయ లేదా కోడి గుడ్డు పరిమాణంలో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్లు కట్టాలని పుత్తూరు హార్టికల్చర్ అధికారి వెంకట సౌజన్య సూచించారు. దీంతో బూడిద తెగులు, ఆకుమచ్చలు, అధిక ఉష్ణోగ్రత నుంచి కాయలను రక్షించుకోవచ్చన్నారు. 7.20 లక్షల ఫ్రూట్ కవర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
VZM: ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకున్న వారంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఇన్విజిలేటర్ల నియామకం, మూల్యాంకన ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.