• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పేదలకు ఆసరాగా CMRF చెక్కులు పంపీణీ చేసిన: ఎమ్మెల్యే

MHBD: వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడకుండా పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. తొర్రూరు పట్టణంలో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన 189 మంది బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 1.05 కోట్ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

February 27, 2026 / 06:33 PM IST

పీఆర్సీ కమిషన్ తక్షణమే ఏర్పాటు చేయాలి: ఏపీటీఎఫ్

SKLM: ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం నరసన్నపేట మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఈ మేరకు వారు ధర్నా నిర్వహించారు. సభ్యులు శ్రీధర్ రావు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ సమస్యలు తీర్చాలని అన్నారు.

February 27, 2026 / 06:32 PM IST

రేపు ఖమ్మం జిల్లాలో ఈటల రాజేందర్ పర్యటన

TG: వెలుగుమట్ల భూబాధితులకు భరోసా కల్పించేందుకు BJP MP ఈటల రాజేందర్.. రేపు ఖమ్మం వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈటల బాధితులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న కష్టాలను నేరుగా అడిగి తెలుసుకుంటారు. పార్టీ పక్షాన బాధితులకు చట్టబద్ధంగా పూర్తి న్యాయం జరిగేలా అవసరమైన అన్ని వేదికలపైనా పోరాటానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయనున్నారు.

February 27, 2026 / 06:32 PM IST

జాబ్ మేళ పోస్టర్ ఆవిష్కరించిన SI

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఎస్సై శ్రీసాయి జాబ్ మేళ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని AR హెడ్ క్వాటర్స్ వద్ద మార్చి 10వ తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల ఖాళీలు ఉండటంతో నిరుద్యోగ యువత తమ ధ్రువపత్రాలతో భారీ ఎత్తున వచ్చి సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

February 27, 2026 / 06:31 PM IST

దరఖాస్తులకు ఆహ్వానం

VZM: వీటి అగ్రహారం ప్రభుత్వ ITI కళాశాలలోని నైపుణ్య కేంద్రం నందు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు 3 నెలలు శిక్షణ కొరకు ధరఖాస్తులు కోరడమైనదని ITI ప్రిన్సిపల్ టి.వి గిరి తెలిపారు.18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి, ఇంటర్ చదివిన వారు అర్హులన్నారు. అభ్యర్ధులు మార్చి 5వ తేదీలోపు https://forms.gle/vkUYDKj9DZyaHY2T8 లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

February 27, 2026 / 06:30 PM IST

‘చంద్రబాబు జీవితం మొత్తం వివాదాస్పదమే’

AP: వైఎస్ జగన్ మీద చంద్రబాబు దారుణమైన విమర్శలు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ‘దొంగదారిలో ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జీవితం అంతా అత్యంత వివాదాస్పదమే. యూనివర్సిటీలో కూడా రెడ్డి, కమ్మల మధ్య గొడవలు పెట్టారు. తన అవసరాలకు ఎవరినైనా, ఎలాగైనా వాడతారు. ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో పార్టీని వాడుకుంటున్నారు’ అంటూ విమర్శించారు.

February 27, 2026 / 06:30 PM IST

గుంటూరు జెడ్పీలో నలుగురికి ఏవోలుగా పదోన్నతులు

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏవో) పదోన్నతులు లభించాయి. జెడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, సీఈవో జ్యోతిబసు ఆధ్వర్యంలో వీరికి నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో సురేష్ బాబు, పాండురంగ స్వామి, శ్రీనివాస మూర్తి, శ్రీనివాసరావు ఉన్నారు.

February 27, 2026 / 06:29 PM IST

‘మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

ATP: ​ఏపీ సైనిక సంక్షేమ డైరెక్టర్ క్యాప్టెన్ పి.సత్యప్రసాద్ శుక్రవారం అనంతపురంలో పర్యటించారు. మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు రామావత్ పార్వతి, దరపనేని శ్రావణిలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. వీరమరణం పొందిన జవాన్ నరేష్ సాకే కుటుంబాన్ని పరామర్శించి, ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, భూమి కేటాయింపుపై హామీ ఇచ్చారు.

February 27, 2026 / 06:28 PM IST

కంటి చూపు బాగుంటే ప్రమాదాలను తగ్గించగలం: CP

WGL: డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని CP సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో ప్రయాణించే వారి గమ్యస్థాలను క్షేమంగా చేరవేయాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు.

February 27, 2026 / 06:26 PM IST

‘సంఘటన్ సృజన్ అభియాన్‌తో సంస్థాగత బలోపేతం’

KMR: కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘటన్ సృజన్ అభియాన్ 7వ రోజు శిక్షణ శిబిరం విజయవంతంగా జరిగింది. రాజ్యసభ సభ్యుడు, AICC మైనారిటీ విభాగం ఛైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గార్హీ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ స్థాయి నిర్మాణ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై మార్గదర్శనం చేశారు. ఉమ్మడి జిల్లాల DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నగేశ్ రెడ్డి పాల్గొన్నారు.

February 27, 2026 / 06:26 PM IST

యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. రేపటి విశేష పూజలు..!

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం విశేష వేడుకలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం. రాత్రి 9:00 గంటలకు శృంగార డోలోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవాలు పరిసమాప్తి గావిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు.

February 27, 2026 / 06:26 PM IST

డిప్యూటీ సీఎంను పరామర్శించిన సినీ నటుడు

W.G: హైదరాబాద్ AIG లో చికిత్స పొందుతున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజును ప్రఖ్యాత సినీ నటుడు మంచు మోహన్ బాబు శుక్రవారం ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. RRR త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేపు డిశార్చ్ అవుతారని టీడీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

February 27, 2026 / 06:25 PM IST

ANU దూరవిద్యలో 5 ఎంబీఏ కోర్సులకు అనుమతి

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) దూరవిద్య కేంద్రం 2026 క్యాలెండర్ సంవత్సరానికి గాను 5 ఎంబీఏ స్పెషలైజేషన్లకు యూజీసీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నుంచి అనుమతి పొందినట్లు సీడీఈ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అలాగే, మార్చి 8న జరగాల్సిన ఎంబీఏ ప్రవేశ పరీక్షను మార్చి 15వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

February 27, 2026 / 06:25 PM IST

రేపే మృత్యుంజయ్ ట్రైలర్ విడుదల

శ్రీ విష్ణు, రెబా మౌనికా జాన్ జంటగా నటించిన మృత్యుంజయ్ చిత్రం.. మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రేపు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, మొదటి సారి శ్రీ విష్ణు కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ వైపు అడుగులు వేశాడు.

February 27, 2026 / 06:23 PM IST

చికెన్ కోసం తమ్ముడిని చంపిన అన్న

AP: అమరావతిలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం వలస వచ్చింది. ఇంట్లో చికెన్ వండుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో అన్న బబ్బు గౌడ్ ఇనుప రాడ్‌తో తమ్ముడు జితేరాజ్‌పై దాడి చేసి చంపేశాడు. నేరం బయటపడకుండా తండ్రి దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

February 27, 2026 / 06:22 PM IST