AP: భూ వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అనగాని పేర్కొన్నారు. హైకోర్టులో ఉన్న ప్రభుత్వ భూవివాదాల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. కేసుల లైజనింగ్ కోసం జిల్లాకు ఒక అధికారిని నియమించినట్లు వెల్లడించారు. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
NLG: చందంపేట మండలం పాత కంబాలపల్లిలో శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రాములవారి దేవాలయ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నట్లు దేవస్థాన కమిటీ వారు బుధవారం తెలిపారు. ఇంతవరకు దాతల సహాయ సహకారాలతో రూ.60 వేలు అందించారని, మరి కొందరు నిర్మాణ సామాగ్రి, గ్రామానికి చెందిన మరో దాత రూ.లక్ష ధ్వజస్తంభం ఏర్పాటుకు విరాళం ప్రకటించినట్లు తెలిపారు.
సత్యసాయి: సోమందేపల్లిలో బాణాసంచా వ్యాపారులకు ఎస్ఐ రమేశ్ బాబు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇళ్లలో లేదా అనుమతులు లేని గోదాముల్లో బాణాసంచా నిల్వ ఉంచరాదని వారికి హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రైడ్స్ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
AKP: తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని నాతవరం మండల సమగ్ర శిక్ష ఉద్యోగుల అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాతవరం ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వేతనాలు, టైమ్ స్కేల్ అమలు, హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత వంటి సమస్యలు ఇంకా పరిష్కారమవ్వలేదని వెల్లడించారు.
WNP: వీపనగండ్ల మండలంలోని తూంకుంట పెద్ద వాగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సంబంధిత పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ రవాణాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. పోలీసుల కళ్లముందు ట్రాక్టర్లు వెళ్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NLG: కనగల్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 6వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్‌ను గ్రామ సర్పంచ్ నర్సింగ్, మురళిగౌడ్, నిర్వహణ కమిటీ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేశారు. విజేత జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. తమ జట్ల పేర్లు వెంటనే నమోదు చేసుకోవాలన్నారు.
విశాఖ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై మెరవనున్నారు. ఈ నెల 5న (గురువారం) ప్రారంభమై 8న ఆదివారం వరకు జరిగే 30వ థాయిలాండ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మీట్‌లో వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ సభ్యులు పాల్గొంటున్నారు. డి.వి.భాస్కరరాజు, గుడ్ల శివరామరెడ్డి, జి.సీతారామ్, డా.మంగ వరప్రసాద్ పోటీపడనున్నారు.
HYD: మౌలాలి డివిజన్ పరిధిలోని విష్ణుపురి కాంప్లెక్స్‌లో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది పనితీరును అధికారులు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.
PPM: కొమరాడ మండలంలోని పలు గ్రామాలలో బుధవారం DRDA ఆధ్వర్యంలో ‘అక్షరాంధ్ర-ఉల్లాస్ ప్రీ ఫైనల్’ పరీక్షలు మొదలైయ్యాయి. ఈ సందర్భంగా చిన కేర్టీల పంచాయతీ సీనాడవలసలో పరీక్షలను వెలుగు APM పువ్వుల సురేశ్ పరిశీలించారు. లెక్చలర్లు అనుకూల సమయంలో పరీక్ష నిర్వహించాలని, ప్రీ ఫైనల్ పరీక్ష అయిన వెంటనే యాప్‌లో హాజరు, మార్కులు నమోదు చెయ్యాలని వాలంటీర్లను ఆదేశించారు.
CTR: గంగవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‍లో మాట్లాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం ప్రధాన కాలువ ద్వారా 4వ విడతలో భాగంగా, 1200 క్యూసెక్స్ నీటిని ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకి విడుదల చేయడం జరుగుతుందని ప్రాజెక్టు నిర్వాహకులు తెలిపారు. కాలువల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, రైతులు, పశుపాలకులు అప్రమత్తంగా ఉండాలని, కాలువలోకి లేదా కాలువ ఒడ్డుల సమీపానికి వెళ్లొద్దని సూచించారు.
వికారాబాద్ నుంచి తాండూర్ వైపు కంకర లోడుతో వెళ్తున్న లారీ బుధవారం తెల్లవారుజామున ధరూర్-గట్టెపల్లి మధ్య అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
NZB: చందూర్ మండల కేంద్రంలోని నర్సరీని సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి బుధవారం పరిశీలించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం ప్రారంభమవుతున్న దృశ్య మొక్కలు వాడిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సురేఖ సాయిలు, పంచాయతీ కార్యదర్శి సాయిలు , వార్డు సభ్యులు తదితరులున్నారు.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, బుచ్చిబాబు తన తదుపరి లక్ష్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని, త్వరలోనే కథ వినిపించనున్నాడని తెలుస్తోంది. ‘పెద్ది’ భారీ విజయం సాధిస్తే, ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కడం ఖాయమని టాలీవుడ్ వర్గాల టాక్.
MBNR: మిడ్జిల్ మండల్ వల్లభరావుపల్లి గ్రామంలో బుధవారం ఉదయం నుంచే హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యువతి, యువకులు, చిన్నారులు ఒకరికొకరు సోదరాభావంతో రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేహిన్ జహంగీర్, రాఘవేందర్, రాజు, నవీన్, చిన్నారులు, యువకులు పాల్గొన్నారు.