• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శాసనసభ సందర్శనకు తణుకు విద్యార్థులు

W.G: రాష్ట్ర శాసనసభ సందర్శనకు తణుకు కొండేపాటి సరోజినీ దేవి మహిళా కళాశాల విద్యార్థినిలు వెళ్లారు. శాసనసభను సందర్శించి సభ విశిష్టత, ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని అధికారులు, ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులు తెలుసుకున్నారు. చదువుకునే వయస్సులోనే ఇటువంటి పర్యటనల ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై అవగాహన ఏర్పడుతుందన్నారు.

March 6, 2026 / 01:39 PM IST

రైతులకు వరి, మొక్కజొన్న పంటలపై అవగాహన

SRD: సదాశివపేట మండల పరిధిలోని మద్దికుంట రైతు వేదికలో శుక్రవారం రైతులకు సమావేశపరిచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి, మొక్క జొన్న పంటలపై రైతులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. రైతులు యాజమాన్యం పద్ధతులు పాటించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు.

March 6, 2026 / 01:39 PM IST

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: కమీషనర్

MDK: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రత్యేక ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం నర్సాపూర్ మున్సిపాలిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు వార్డులలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చెత్తను శుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛ మున్సిపాలిటీ కోసం ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్ కమీషనర్, పాలకవర్గం పాల్గొని పరిసరాలను బాధ్యతతో శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

March 6, 2026 / 01:38 PM IST

పోగొట్టుకున్న నగదును తిరిగి అప్పగించిన పోలీసులు

KMM: కృష్ణా జిల్లా కలగర గ్రామానికి చెందిన రావుల అప్పారావు కోదాడ వెళ్తూ మధిర శాంతి థియేటర్ సమీపంలో తన వద్ద ఉన్న రూ.60 వేలు పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఐఓపీ డి.రమేష్ ఆదేశాల మేరకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. కేవలం 30 నిమిషాల్లోనే నగదును గుర్తించి బాధితుడికి అందజేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లును ఐఓపీ అభినందించారు.

March 6, 2026 / 01:38 PM IST

మండుతున్న ఎండలు నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు

SDPT:  చేర్యాలలో ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తుండటంతో మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఎండలు మండిపోతుండగా ఏప్రిల్, మే నెలల్లో ఎండలు, వడగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కావున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

March 6, 2026 / 01:35 PM IST

వేసవికి సిద్ధంగా ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వ: ఎస్ఈ

CTR: వేసవి దృష్ట్యా కనీసం 1,800 ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ ఉంచాలని చిత్తూరు ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నెలకు 400కిపైగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు వస్తుండగా, ఏప్రిల్‌లో ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశం ఉందన్నారు.

March 6, 2026 / 01:35 PM IST

మతాలను దాటకపోతే అభివృద్ధి సాధ్యం కాదు: పవన్

AP: కూటమికి అన్ని కులాలు, మతాల మద్దతు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కులాలు, మతాలను దాటకపోతే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదన్నారు. మనం బాధ్యతగా ఉండాలని.. లేకపోతే ఎన్ని బడ్జెట్‌లు పెట్టినా ఉపయోగం ఉండదని చెప్పారు. అలాగే, కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు.

March 6, 2026 / 01:35 PM IST

వైభవంగా కుంకుమార్చన.. నెలకొన్న ఆధ్యాత్మికత

RR: జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతిదేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పెద్దఎత్తున పాల్గొని కుంకుమార్చన చేశారు. ప్రజలు కార్యక్రమానికి తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మికత సంతరించుకుంది.

March 6, 2026 / 01:34 PM IST

వాడపల్లి స్వామివారికి బంగారు మకర తోరణం సమర్పణ

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి తణుకు వాస్తవ్యులు పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి కుటుంబసభ్యులు రూ. 60 లక్షలు విలువ చేసే 350 గ్రాముల బంగారంతో చేసిన మకర తోరణాన్ని శుక్రవారం సమర్పించారు. దాత కుటుంబ సభ్యులు ఈ మకర తోరణాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్ రావుకు అందజేశారు. ఆయన వారిని సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

March 6, 2026 / 01:34 PM IST

అగస్తీశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం

తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీకామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకోగా, ఆయనతో పాటు తిరుపతి రూరల్ ఎంపీపీ విడుదల మాధవ రెడ్డి పాల్గొన్నారు.

March 6, 2026 / 01:34 PM IST

కన్నుల పండువగా రాజరాజేశ్వర స్వామి కళ్యాణం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మాహాక్షేత్రంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపై ఆలయ స్థానాచార్యులు నమిలికొండ ఉమేశ్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.

March 6, 2026 / 01:34 PM IST

ఎమ్మెల్యే వివాదం… నేడు కోర్టుకు హర్షవీణ

అన్నమయ్య: రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి హర్షవీణ ఇవాళ స్థానిక కోర్టుకు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసులో హైకోర్టు మార్చి 2న హర్షవీణకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ షూరిటీలు స్థానిక కోర్టులో దాఖలు చేయనున్నారు.

March 6, 2026 / 01:31 PM IST

‘శనగ, మొక్కజొన్న గిట్టుబాటు ధరలకు అమ్మాలి’

GNTR: వ్యవసాయంతో గ్రామీణ అభివృద్ధిలో మార్పు అనే అంశంపై రైతులకు వెబినార్ సందేశం, సమావేశం శుక్రవారం ఫిరంగిపురం–1 రైతు సేవా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు.

March 6, 2026 / 01:30 PM IST

గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేవీఆర్

KMR: పాల్వంచ మండలం ఫరీద్‌పేటలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన గనులని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు, యువత పుస్తకాలను చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.

March 6, 2026 / 01:28 PM IST

స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్ ఆవిష్కరణ

PPM: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా అధికారుల చొరవ, సహకారంతో జిల్లా ముందంజలో ఉందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

March 6, 2026 / 01:28 PM IST