• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైసీపీపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి విమర్శలు

AP: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో మంత్రి డీఎస్‌బీవీ స్వామి పింఛన్లు పంపిణీ చేశారు. దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని కొనియాడారు. కల్తీ నెయ్యిపై శాసనమండలిలో చర్చకు రాకుండా వైసీపీ పారిపోతోందని ఎద్దేవా చేశారు. చర్చ జరగకుండా సభ నుంచి తప్పించుకున్నా.. దేవుడి నుంచి తప్పించుకోలేరని అన్నారు.

February 28, 2026 / 11:14 AM IST

న్యాయవగాహన సదస్సు

మహబూబ్నగర్ రూరల్ ధర్మాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిఎల్వి శివన్న పంతులు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు, డ్రగ్స్, రోడ్డు భద్రత, విద్య, సైబర్ నేరాలు, వరకట్నం, బాల కార్మికులు, తదితర చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవా అధికార సంస్థ అండగా ఉంటుందన్నారు.

February 28, 2026 / 11:13 AM IST

ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

ATP: ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు శనివారం ఉదయం లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేసిందని తెలిపారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం కోసమే ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు.

February 28, 2026 / 11:10 AM IST

ప్రజలతో నేరుగా మమేకం కావడం కోసమే ‘మన్ కి బాత్’

E.G: ప్రజలతో నేరుగా మమేకం కావడం కోసమే ప్రధాని మోడీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో మాన్ కి బాత్ క్విజ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బహుమతులు అందించారు.

February 28, 2026 / 11:10 AM IST

ఖాళీగా ఉన్న ANM పోస్టులను భర్తీ చేయండి సారూ.!

KMM: ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ANMల కొరత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని ఏళ్లుగా PHC పరిధిలో 5 ANM పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా గ్రామాల్లో వైద్య సేవలు సరిగా అందడం లేదని చెప్పారు. ఏఎన్ఎంల కొరత కారణంగా అదనపు బాధ్యతలతో సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలన్నారు.

February 28, 2026 / 11:09 AM IST

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

PLD: మాచవరం మండలం సింగరాయపాలెం తండా సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ వేడుకలు శనివారం ఘనంగా జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు కొండ దిగువన గల కళ్యాణ మండపంలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు పిల్లుట్ల సర్పంచ్ శివపార్వతి సాంబశివరావు తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

February 28, 2026 / 11:08 AM IST

జిల్లా నూతన కార్యవర్గ నియమాకం..!

కర్నూలు: జిల్లా BJP కమిటీలో పలు కీలక పదవులకు కొత్త నియామకాలు చేపట్టారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా దాసరి యువరాజు, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ షహీన్‌ను నియమించారు. అధికార ప్రతినిధులుగా లోకేష్, దేశాయి గురురాజ స్వామి, బోయ బ్రహ్మయ్యలను ఎంపిక చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు బాపురం రామకృష్ణ పిలుపునిచ్చారు.

February 28, 2026 / 11:08 AM IST

సిల్ట్ ఛాంబర్ లేకుండా.. వేల హోటళ్లు, రెస్టారెంట్లు!

HYDలో సిల్ట్ ఛాంబర్లు లేకుండా వేల సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ జలమండలి కఠిన చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. హోటల్ రెస్టారెంట్ల నుంచి భారీగా కూరగాయల వ్యర్ధాలు వచ్చి డ్రైనేజీలో కలుస్తుండడంతో బ్లాక్ కేజీ జరిగి మ్యాన్ హోల్స్ నుంచి పొంగి పొర్లుతుంది. దీంతో సిల్ట్ ఛాంబర్ తప్పనిసరి చేశారు.

February 28, 2026 / 11:07 AM IST

కల్తీ పాల బాధితులను పరామర్శించిన నిమ్మల

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వెంటిలేటర్‌పై 11 మందికి వైద్యులు డయాలసిస్ అందిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి ఆదేశించారు. వారికి ఎలాంటి సహాయం కావాలన్న ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

February 28, 2026 / 11:07 AM IST

గండి క్షేత్రం ఆదాయ వివరాలు..!

KDP: చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి రూ.1.09 కోట్ల ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ తెలిపారు. స్థానిక ఆలయం వద్ద శుక్రవారం తలనీలాలకు, కొబ్బరికాయల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండి ఆలయ మాజీ చైర్మన్లు వెంకటస్వామి, భాస్కర్ పాల్గొన్నారు.

February 28, 2026 / 11:06 AM IST

బాలుడి పై కుక్క దాడి..!

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం మూడు సంవత్సరాల బాలుడి పై కుక్క దాడి చేసింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడి పై వీధి కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు తల్లిదండ్రులు తెలపగా.. హుటాహుటిన చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 28, 2026 / 11:05 AM IST

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, SBI బ్యాంకులు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలన్నారు.

February 28, 2026 / 11:05 AM IST

ప్రముఖ పాప్ సింగర్ కన్నుమూత

ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ నీల్ సెడకా (86) కన్నుమూశారు. ‘బ్రేకింగ్ అప్ ఈజ్ హార్డ్ టు డూ’, ‘క్యాలెండర్ గర్ల్’ వంటి హిట్లతో ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఆరు దశాబ్దాల కెరీర్‌లో మూడు బిల్బోర్డ్ నంబర్ 1 హిట్లు సాధించిన ఆయన, 1983లో ‘సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు.

February 28, 2026 / 11:05 AM IST

ఆమనగల్లు శ్రీరామలింగేశ్వర స్వామి జాతరకు పోదామా..!

NLG: కాకతీయ కాలం నుంచి ప్రసిద్ధి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతర రానే వచ్చింది. రాష్ట్రంలోనే నాలుగో జాతరగా గుర్తింపు పొందిన జాతరగా నిలిచింది. రేపటి నుంచి జాతర అట్టహాసంగా ప్రారంభం కానుంది. గణపతి పూజతో ప్రారంభమై నాలుగు రోజులపాటు జాతర జరగనుంది. ఈ జాతర పురాతన కాలం నుంచి క్రీడలకు మారుపేరుగా నిలిచింది.

February 28, 2026 / 11:05 AM IST

జిల్లాలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

BPT: పాత బస్టాండ్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ తెలిపారు. పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. ఈరోజు మరియు ఆదివారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదు కొనసాగుతుందని పేర్కొన్నారు.

February 28, 2026 / 11:04 AM IST