• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మురికి కాలువల్లో పూడిక తొలగించాలి’

AKP: ఎలమంచిలి పట్టణం ధర్మవరం ప్రాంతంలో శనివారం పర్యటించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మురికి కాలువలను పరిశీలించారు. తక్షణం కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం డ్రైనేజ్ నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. డ్రైనేజ్‌పై అనధికారికంగా ఉంచిన పలకలను తొలగించాలని ఆదేశించారు. గత పాలకులు డ్రైనేజ్ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారన్నారు.

February 21, 2026 / 04:01 PM IST

13వ వార్డు కౌన్సిలర్ స్నేహపై అనర్హత వేటు

ASF: మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటింగ్ చేసినందుకు 13వ వార్డు కౌన్సిలర్ స్నేహపై చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారి, RDO జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించి విప్ ధిక్కరణ నిజమని తేల్చారు. తెలంగాణ పురపాలక చట్టం-2019 ప్రకారం ఆమెను కౌన్సిలర్ పదవి నుంచి అనర్హురాలిగా ప్రకటించారు.

February 21, 2026 / 04:01 PM IST

‘కొబ్బరి రైతులను ఆదుకోవాలి’

ELR: కొబ్బరికాయలు ధరలు పడిపోకుండా చర్యలు చేపట్టి కొబ్బరి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ కోరారు. శనివారం ఏలూరులో ఆయన మాట్లాడారు. ఇటీవల కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లలో కొబ్బరి సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని గుర్తు చేశారు.

February 21, 2026 / 04:00 PM IST

అధిక శబ్ద సైలెన్సర్లు, హారన్ల ధ్వంసం

KRNL: జిల్లాలో అధిక శబ్దం చేసే బైక్ సైలెన్సర్లు, ఆటో హారన్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 100 సైలెన్సర్లు, 500 హారన్లను సీజ్ చేసి రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు. శబ్ద కాలుష్యంపై ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మోటార్ వాహన చట్టం ప్రకారం అనుమతి లేని మార్పులు చేసిన వాహనాలను నడుపరాదన్నారు

February 21, 2026 / 04:00 PM IST

పుట్టపర్తిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శనివారం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 243 మందికి రూ.2.44 కోట్ల మేర ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 21, 2026 / 04:00 PM IST

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ. 45.85 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైంది. ఇందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 36 మందికి రూ. 36.60 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. శనివారం రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

February 21, 2026 / 04:00 PM IST

జీరో వేస్ట్ లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం

NDL: డోన్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ‘జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ థీమ్‌తో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొని పరిశుభ్రత పనులను పరిశీలించారు. చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పరిశుభ్రమైన వాతావరణంపై అవగాహన పెంపు అవసరమని సూచించారు.

February 21, 2026 / 04:00 PM IST

అన్న క్యాంటీన్లను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్

KKD: పేద ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అన్న క్యాంటీన్లలో అందజేయాలని కాకినాడ అదనపు కమిషనర్ సుధాకర్ సూచించారు. శనివారం ఆయన వివేకానంద పార్క్, రమణయ్య పేటలోని అన్న క్యాంటీన్లను తనిఖీ చేశారు. ఆహారాన్ని రుచి చూసి అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

February 21, 2026 / 04:00 PM IST

‘హిందూ ధర్మంపై వైసీపీ విష ప్రచారం’

AP: హిందువులకు మాజీ సీఎం జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. చెప్పులు వేసుకుని స్వామివారి ఫొటోలు పట్టుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్‌లో ఇదంతా జరిగిందని తెలిపారు. హిందూ ధర్మంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నేతలకు లీగల్ నోటీసులు ఇస్తామన్నారు.

February 21, 2026 / 04:00 PM IST

‘వ్యర్థాల నిర్వహణలో ‘జీరో లిట్టర్’ నగరంగా తీర్చిదిద్దుతాం’

GNTR: గుంటూరు నగరాన్ని వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలిపి “జీరో లిట్టర్” నగరంగా తీర్చిదిద్దుతామని గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం ఉద్యోగ నగర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కంపోస్ట్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. డంపింగ్ యార్డులపై భారం తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు

February 21, 2026 / 03:59 PM IST

‘ప్రకాశం జిల్లాకు డీఎస్సీ పోస్టులు పెంచాలి’

ప్రకాశం: త్వరలో విడుదల కానున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకాశం జిల్లాకు అధిక సంఖ్యలో పోస్టులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కోరారు. శనివారం ఈ మేరకు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు.

February 21, 2026 / 03:58 PM IST

క్యాతనపల్లిలో ముదురుతున్న వివాదం

TG: క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఛైర్మన్ సీటు వివాదం ముదురుతోంది. మంత్రి వివేక్ కారుపై దాడి కేసులో బాల్క సుమన్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. BRS కౌన్సిలర్ భూమయ్య గౌడ్ అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారని.. అధికారులు కూల్చేసేందుకు రావడంతో.. ఉద్రిక్తత మరింత పెరిగింది. మంత్రి వివేక్ నీచ రాజకీయాలు చేస్తున్నారని BRS నేతలు ఆరోపిస్తున్నారు.

February 21, 2026 / 03:58 PM IST

ఆలయాన్ని సందర్శించిన శాసనసభ స్పీకర్

BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన స్పీకర్‌కు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘన స్వాగతం పలికి ఆలయ విశిష్టతను, ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:58 PM IST

విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం

కృష్ణా: డోకిపర్రు గ్రామ పరిధిలోని జడ్పీ హైస్కూల్‌లో శనివారం విద్యార్థులకు చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, బాల బాలికల రక్షణ, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, మత్తు పదార్థాల వ్యతిరేకత, సైబర్ మోసాలపై గుడ్లవల్లేరు ఎస్సై ఎన్.వి.వి. సత్యనారాయణ వివరించారు. అత్యవసరాలకు 112, సైబర్ నేరాలకు 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.

February 21, 2026 / 03:56 PM IST

‘ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు’

BPT: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాపట్ల తహసీల్దార్ షేక్ సలీమా హెచ్చరించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. మరుప్రోలువారిపాలెం గ్రామంలోని సర్వే నం. 234/5లో 12 సెంట్ల భూమిని కోడూరు హనుమంతరావు, కోడూరు రామకృష్ణ, మున్నం వెంకటేశ్వరరెడ్డి, కోకి పోలిరెడ్డి తమదని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

February 21, 2026 / 03:55 PM IST