నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో 21వ డివిజన్, ఎన్టీవో కాలనీకి చెందిన కోడూరు రవి, ఖాదర్ బాష, ప్రవీణ్ వారి మిత్రబృందం టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి కోటంరెడ్డి సోదరులు సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా చేరిన వారికి తగు ప్రాధాన్యత ఉంటుందన్నారు
CTR: చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ అముద, చూడ ఛైర్పర్సన్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
AP: వేంకటేశ్వరస్వామి తమ ఇంటి దైవమని సీఎం చంద్రబాబు తెలిపారు. వేంకటేశ్వరస్వామి స్వయంగా తనను కాపాడారని చెప్పారు. అలాంటి స్వామివారిని అపవిత్రం చేస్తే ఊరుకోనని తేల్చి చెప్పారు. లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాను ప్రాణం పోయినా తప్పు చేయనని తేల్చి చెప్పారు.
NZB: బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఆధ్వర్యంలో 11వ వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుక బాలరాజు, 29వ వార్డు కౌన్సిలర్ రాజులదేవి లక్ష్మీ పూజిత పవన్ కుమార్, 33వ వార్డు కౌన్సిలర్ గుంత అబ్బవ్వ గంగాధర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
NZB: బోధన్ పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ మాణిక్ బండార్‌కు చెందిన రాజ్ కుమార్ కాలినడకన వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడికి 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి, జిల్లా ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణలపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో పరిపాలన అధికారి లక్ష్మినారాయణ అధ్యక్షతన ఆర్డీవో కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ మరణించిన , రెండుసార్లు నమోదైన 324 ఓట్లను ఫారం–7 ద్వారా తొలగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
KDP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కడప జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
E.G: 2027 గోదావరి మహా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలోని కలెక్టర్ వద్ద సమగ్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా SP డీ.నరసింహ కిషోర్, JC వై.మేఘా స్వరూప్ పాల్గొన్నారు. పుష్కరాల కోసం పార్కింగ్ స్థలాలు, పుష్కర నగర్‌ల ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
NZB: బాన్సువాడలో శుక్రవారం రాత్రి ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడకు వెళ్తున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను పోలీసులు భిక్కనూర్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో గ్లోరియా శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులను సమగ్రంగా పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. సిబ్బంది హాజరు నమోదు, విధుల నిర్వహణ తీరును పరిశీలించిన ఆమె, కంప్యూటర్ విభాగాన్ని సందర్శించి పట్టాదారు పాసుపుస్తకాలు, కుటుంబ సభ్యుల ధృవపత్రాల దరఖాస్తులపై సమీక్ష చేశారు.
TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాత్రి BJP నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని.. పోలీసుల బలప్రయోగంతో, నిరంకుశ చర్యలతో ఆ హక్కును కాలరాయాలని చూడటం పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు.
PLD: సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని శానిటరీ వర్కర్లకు శనివారం ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికులకు ‘సమాన పనికి సమాన వేతనం’ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చెన్నకేశవరావు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
పదవ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో కీలక దశ అని ఇవాళ ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. శ్రీ లక్ష్మి హై స్కూల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని, టెన్త్ మార్కులు ఉన్నత చదువులకు పునాది అవుతాయని తెలిపారు. ఈ ఏడాది పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
SDPT: ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని ఏసీపీ సుమన్ కుమార్ కోరారు. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ఈనెల 28 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినతరం చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
GNTR: వడ్లమూడి బాల కోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా సమగ్ర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను దేవస్థాన అధికారులు ఘనంగా సన్మానించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాలువా కప్పి ప్రసాదం అందజేశారు. తిరునాళ్లకు భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో పోలీసుల పాత్ర కీలకమన్నారు.