బాలకృష్ణ హోస్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా… అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ప్రోమోలు అన్నీ కూడా బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అనేవిధంగా అదరగొట్టాయి. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌కు సర్వర్ క్రాష్ సమస్యను ఎదుర్కొంది. పవన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆహా టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న...
మద్యం తాగే అలవాటు లేనివారు చాలా తక్కువ. ఎక్కువ మంది ఏదైనా అకేషన్ సందర్భంగా తీసుకుంటారు. కానీ కొంతమంది మద్యం లేకుండా ఒకరోజు కూడా ఉండలేరు. అధిక మద్య సేవనం వల్ల కాలేయం దెబ్బతింటుంది. మనం సజీవంగా ఉండేందుకు సహాయపడే 500కు పైగా ముఖ్య విధులను కాలేయం నిర్వహిస్తుంది. అవసరమైనప్పుడు శీఘ్రశక్తిని ఇవ్వడం, గ్లుకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడం, శరీరం నుండి విషపదార్థాలు తొలగించడం, ఇన్పెక్షన్‌తో పోర...
పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి హాలులోకి ఎంటర్ కాగానే, అక్కడ తాను తప్ప అందరూ అమ్మాయిలు ఉండటం చూసి స్పృహ తప్పి పడిపోయిన సంఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో చోటు చేసుకున్నది. ఇక్కడి ఇక్బాల్ కాలేజీ 17 ఏళ్ల విద్యార్థి మనీష్ శంకర్ ప్రసాద్ ఇంటర్ పరీక్ష మ్యాథ్స్ రాయడానికి బ్రిలియంట్ కాన్వెట్ స్కూల్‌కు వెళ్లాడు. ఎగ్జామ్ హాలులోకి వెళ్లగానే, 50 మంది వరకు అమ్మాయిలు ఉన్నారు. తానొక్కడే అబ్బాయి. అమ...
త్వరలో విశాఖపట్నం భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సంబంధించి ఢిల్లీలో జరిగిన సన్నాహక సదస్సు వివరాలను వెల్లడించారు. 49 దేశాలకు చెందిన ప్రతినిధులు, అసోచామ్, ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్ ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో...
కొత్త రాష్ట్రం తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయమే చేస్తోంది. చేదోడు ఇవ్వాల్సిన కేంద్రం చేతులు విరిచేలా ప్రవర్తిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కిన ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఒక్క చోట కూడా తెలంగాణ అనే పదం బడ్జెట్ ప్రసంగంలో వినిపించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించింది. అలాంటి రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉంద...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం రెండుసార్లు మాత్రమే పేదల ప్రస్తావన తెచ్చారన్నారు. ప్రజలు, వారి ఆందోళనలను ఏమాత్రం మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏ మాత్రం కనికరం లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారన్నారు. 90 నిమిషాల ప్రసంగంలో నిరు...
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పాన్ ఇండియా స్టార్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇద్దరూ లవ్ బర్డ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇద్దరి మధ్య నిజంగా లవ్ ఉందో లేదో తెలియదు కానీ.. ఈ ఇద్దరు మాత్రం ప్రస్తుతం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి వీళ్లిద్దరూ కలిసి నటించింది రెండు సినిమాల్లోనే. కానీ.. వీళ్ల జంట ఆన్ స్క్రీన్ మీద బాగా వర్కవుట్ అయింది. గీత గోవిందం...
తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అని, అక్కడకు తాను షిఫ్ట్ అవుతున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మూడు రాజధానులపై స్పందిస్తున్నారు. జగన్ ఢిల్లీలో కొత్తగా ఏమీ చెప్పలేదని, ఎప్పుడూ చెప్పేదే చెప్పారన్నారు. సుప్రీం కోర్టు కూడా తమకు రాజధానిపై శాసనాధికారం లేదంటే, కేంద్రం ప్రభుత్వంతో బిల్లు...
ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం కలిశారు. ఈసందర్భంగా మాట్లాడిన నిక్.. సీఎం జగన్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎంను పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను కానీ.. ఎక్కడ కూడా ఏపీలో అవలంభిస్తున్న విధానాలను పాటించడం లేదని, ఇక్కడ ఎంతో స్ఫూర్తిదా...
వేతనజీవులు ఆకర్షణీయంగా ఉన్న కొత్త పన్ను విధానంలోకి మారవచ్చునని, అయితే ఎవరినీ ఈ పన్ను విధానంలోకి రావాలని బలవంతం చేయబోమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదాయపు పన్నులో చేసిన గణనీయమైన మార్పులు మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకరించడంతో ప్రస్తుతం కొత్త పన్నుల విధానం అధిక ప్రోత్స...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీనిపై హరీష్ స్పందించారు. ఉపాధి హామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి బడ్జెట్‌లో దాదాపు 30 శాతం కోత విధించారన్నారు. ఎరువుల సబ్సిడీని తగ్గించి రైతులపై అదనపు భారం మోపుతున్నా...
హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరుకు తగ్గట్టుగానే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప హాస్య నటుడిగా రికార్డు సాధించారు. బ్రహ్మానందం కొన్ని వందల సినిమాల్లో నటించి మరో రికార్డును క్రియేట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ లో చోటు సంపాదించారు. ఫిబ్రవరి 1న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. బ్రహ్మానందం ఇంటికి వెళ్లి మ...
పాదయాత్ర ఇప్పుడు అందరికీ ఓ ఫ్యాషన్‌గా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఉద్దేశించి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే, వారు ఆదరిస్తారు, గౌరవిస్తారని, కానీ జగన్ హయాంలో ఏపీ సంతోషంగా ఉందని చెప్పారు. ఇలాంటప్పుడు పాదయాత్ర చేస్తే ఎవరూ హర్షించరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అ...
అన్ స్టాపబుల్ పేరుతో ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆ షో తొలి సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. రెండో సీజన్ కూడా ఫినాలేకు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్స్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ రానున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ ప్రోమోలు విడుదలయ్యాయి. అవి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ప్రభాస్ ఎపిసోడ్ రిలీజ్ కాగానే ఆహా క్రాష్ అయిపోయింది....
చాలా ప్రాంతాల్లో తల్లి తదనందరం ఆమె ఆస్తిపాస్తుల కంటే కూడా ఆమె నగలు ఎవరికి చెందాలి అనేదానిపై చాలా గొడవలు జరుగుతుంటాయి. నిజానికి మనం కలి యుగంలో ఉన్నాం. మనిషి చనిపోకముందే.. వాళ్ల ఆస్తులు, అంతస్తులు, బంగారం ఇతరత్రా గురించి ముందే డిస్కస్ చేసుకునే కాలంలో ఉన్నాం. చాలా ఇంట్లో ఇది జరిగేదే. తల్లి మరణించిన తర్వాత ఆమె నగలు ఎవరికి చెందాలి అనేది ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్ కాదు.. చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నదే...