motivational speaker nik vujicic meets cm ys jagan
ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం కలిశారు. ఈసందర్భంగా మాట్లాడిన నిక్.. సీఎం జగన్ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎంను పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను కానీ.. ఎక్కడ కూడా ఏపీలో అవలంభిస్తున్న విధానాలను పాటించడం లేదని, ఇక్కడ ఎంతో స్ఫూర్తిదాయకంగా విద్యా కార్యక్రమాలు జరుగుతున్నాయని, విద్యారంగంలో ఎంతో పురోగతిని తీసుకొచ్చిన సీఎం జగన్ ను ఆయన అభినందించారు. తాను ఒక మోటివేషనల్ స్పీకర్ ను అని.. తాను చాలామందికి ప్రేరణగా ఉంటానని చెప్పిన నిక్.. ఇక్కడికి వచ్చాక ఈ ప్రాంతమే తనకు ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు.
గుంటూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను నిక్ మంగళవారం సందర్శించారు. అక్కడ విద్యార్థినులు ఇంగ్లీష్ లో మాట్లాడే తీరు, స్పష్టత చూసి నిక్ ఆశ్చర్యపోయారు. ఈసందర్భంగా వాళ్లు తమ లక్ష్య సాధన కోసం ఏం చేయాలో నిక్.. దిశానిర్ధేశం చేశారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్. pic.twitter.com/ji296VDWAL
మఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ను కలవడం గౌరవంగా భావిస్తున్నాను. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారు. pic.twitter.com/657ulZhaX7