హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరుకు తగ్గట్టుగానే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప హాస్య నటుడిగా రికార్డు సాధించారు. బ్రహ్మానందం కొన్ని వందల సినిమాల్లో నటించి మరో రికార్డును క్రియేట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ లో చోటు సంపాదించారు. ఫిబ్రవరి 1న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. బ్రహ్మానందం ఇంటికి వెళ్లి మరీ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలో ఒక లెక్చరర్. ఈరోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్యనటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చెయ్యక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలంటి బ్రహ్మానందానికి హృదయ పూర్వక శుభాభినందనలు.
బ్రహ్మానందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ, పదిమందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మానందంకి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తనకి నా జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.