KDP: కడప జిల్లాపై తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని డీఈవో శంషుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.