సత్యసాయి: హిందూపురంలో 10 మంది అస్వస్థతకు గురైన ఘటనపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. కల్తీ కల్లు సేవించడమే దీనికి కారణమని పార్టీ ఆరోపించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పుడు హిందూపురంలోనూ అలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ వైఫల్యమని వైసీపీ ట్వీట్లో పేర్కొంది.