KDP: బ్రహ్మంగారిమఠంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు వీరబ్రహ్మేంద్రస్వామి వారి నివాస గృహం కూలిపోయింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని, పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు ఆయన నివాస గృహాన్ని కాపాడుకోకపోడంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.