మద్యం తాగే అలవాటు లేనివారు చాలా తక్కువ. ఎక్కువ మంది ఏదైనా అకేషన్ సందర్భంగా తీసుకుంటారు. కానీ కొంతమంది మద్యం లేకుండా ఒకరోజు కూడా ఉండలేరు. అధిక మద్య సేవనం వల్ల కాలేయం దెబ్బతింటుంది. మనం సజీవంగా ఉండేందుకు సహాయపడే 500కు పైగా ముఖ్య విధులను కాలేయం నిర్వహిస్తుంది. అవసరమైనప్పుడు శీఘ్రశక్తిని ఇవ్వడం, గ్లుకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడం, శరీరం నుండి విషపదార్థాలు తొలగించడం, ఇన్పెక్షన్తో పోరాటం.. ఇలా ఎన్నో విధులను నిర్వహిస్తుంది. మద్యం మాత్రమే కాదు, ఆహారం కూడా అమితంగా తీసుకుంటే ఇబ్బందికరమే. కానీ మద్యపానం సేవించడానికి ఓ సమయం, పరిమితి అనేది ఉండదు ఎంతోమందికి. బాటిళ్లకు బాటిల్స్ తాగేవారు ఉంటారు. చీప్ లిక్కర్ రోజూ తాగకుండా ఉండని వారు ఎందరో. దీని వల్ల లివర్ చెడిపోతుంది. మద్యం పరిమితస్థాయిలో తాగితే ఇబ్బంది ఉండకపోవచ్చు… అమితంగా తాగితే మాత్రం నష్టాలు తప్పవు.
కానీ మద్యం ఎక్కువగా తాగినా.. లివర్ ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉండాలంటే ఓ పరిష్కారం ఉందట. అదే గ్రీన్ టీ. గ్రీన్ టీలో ట్యన్నిన్స్, కేట్చిన్స్ అనే యాంటీయాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. మద్యం ఎక్కువగా తీసుకున్నప్పుడు వచ్చే ఫైబ్రోసిస్, సిర్రోసిస్, హెపథిసిస్ వంటి విష పదార్థాలను గ్రీన్ టీ లోని యాంటీ యాక్సిడెంట్స్ నాశనం చేస్తాయి. అందుకే మద్యం అలవాటు ఉన్నవాళ్లు కాఫీలు, టీలు మానివేసి, గ్రీన్ టీ తీసుకోవాలని సూచిస్తున్నారు. మద్యం తాగే వారికి కడుపులో మంట వస్తుంది. అప్పుడు రోజుకు ఒక ఆపిల్ తింటే… ఇందులోని పెక్టిన్ అనే కెమికల్ లివర్‌లో ఉండే ట్యాక్సన్స్ను నాశనం చేస్తాయి. అల్లం రసం కూడా తాగాలి. ఇందులో ఉండే అల్లిసిన్, సెలేనియం లివర్‌ను రక్షిస్తాయి. విటమన్ సీ ఆహారం లివర్‌కు మంచిది. మద్యం తీసుకోవడం వల్ల లివర్‌లో పేరుకున్న వ్యర్థాలను, విష పదార్థాలను విటమిన్ సీ నాశనం చేస్తుంది. బత్తాయి, నారింజ, నిమ్మ.. వీటిలో సిట్రస్ ఉంటుంది. వీటిని రోజు తినడం లేదా తాగడం అలవాటు చేసుకోవాలి. మద్యం ఎక్కువగా తీసుకునే వారు వీటిని తీసుకుంటే లివర్ త్వరగా డ్యామేజ్ కాదట.