ఏపీ స్పోర్ట్స్ శాఖ మంత్రి రోజా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా నియమితులైనట్లు వెల్లడించింది. ఆర్కే రోజాతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం దక్కింది. సాయ్ లో రోజా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సాయ్ అధ్యక్షుడిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కొన...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈనేపథ్యంలో రాజ్ భవన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. గవర్నర్ తమిళిసైని మంత్ర ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్థికశాఖ కార్యదర్శి, అసెంబ్లీ సెక్రటరీ కూడా కలిశారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి పొసగడం లేదు. ఇటీవల జరి...
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని రామకృష్ణాపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ వల్ల పాఠశాలలో చదువుతున్న 130 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థఆనికంగా కలకలం రేపింది. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న బాలికలు వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో బ...
గోవాలో కొత్త రూల్స్ ను అమలు చేస్తూ ఆ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రూల్స్ ప్రకారం ఇకపై గోవాలో ఎక్కడబడితే అక్కడ సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉండదు. బహిరంగ ప్రదేశాల్లో, బీచ్ లల్లో మద్యం తాగుతూ పట్టుబడితే అక్కడి సర్కార్ జరిమానా విధించనుంది. అలాగే పబ్లిక్ ప్లేస్ లో ఆహారం వండితే రూ.50 వేల వరకూ ఫైన్ వేయనుంది. గోవాలో పర్యాటకుల గోప్యత, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర సర్కార్ ఈ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ సాయంత్రం డిల్లీకి బయలుదేరగా.. ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్యతో తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయిన విషయం తెలిసిందే. అత్యవసరంగా గన్నవరంలో లాండింగ్ చేశారు. ఈ ఘటనపై సీఎం జగన్ అధికారులపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడితే ఏం చేస్తున్నారు అంటూ జగన్ సీరియస్ అయ్యారు. జీఏడీ, సీఎంవో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విమానంలో సాంక...
తిరుమల తిరుపతి దేవస్థానంలో నయా దందా బయటపడింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలంటే రూ.300 చెల్లించాలి. దాన్ని సుపథం ఎంట్రీ అంటారు. దాని కోసం ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. రూ.300 విలువైన టికెట్లను అక్రమంగా ఎక్కువ ధరకు అమ్ముకొని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అందులో టీటీడీ ఉద...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బులెటిన్ విడుదలైంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి సోమవారం తాజాగా బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నాడని వెల్లడించారు. అయితే తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఇప్పటి వరకూ కూడా తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అస...
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయన సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరినా ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర లాండింగ్ చేశారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే సీఎం జగన్ ఉండిపోయారు. రేపు గ్లోబర్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో సీఎం పాల్గొనాల్సి ఉంది. అందుకే మరో ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం జగన్ ...
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రూప్ 4 దరఖాస్తుల గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 4 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నా సర్వర్ సమస్య వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని జనవరి 30 తో ముగియనున్న గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 3 వ తేదీ వరకు గ్రూప్ 4 కి అప్లయి చేసుకోవచ్చు. గ్రూప్ 4 లో అదనపు పోస్టులను కూ...
గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు లాభాల బాట పడ్డాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 59,500 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 45 పాయింట్లు పెరిగి 17,649కు చేరింది. ఐటీ, టెక్, టెలికామ్ సంస్థలు లాభాలతో మార్కెట్లను నడిపించాయి. ఇదిలా ఉండగా నేడు అదానీ గ్రూపు షేర్లు మరోసారి పతనం అయ్యాయి. గత రెండు రోజులుగా అదానీ గ్రూపు షేర్లు పతనం అవు...
ఏపీ సీఎం జగన్ కు ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితం సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలోని సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించారు. దీంతో తిరిగి విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన వల్ల సీఎం జగన్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. సీఎం జగన్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం...
పాకిస్థాన్ లోని పెషావర్ లో ఇవాళ మధ్యాహ్నం దారుణ ఘటన చోటు చేసుకుంది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిపై ఓ వ్యక్తి విరుచుకుపడ్డాడు. ఆత్మహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా.. 150 మంది గాయపడ్డారు. పోలీస్ లైన్స్ ఏరియాలో ఉన్న ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. #UPDATE | At least 28 people were [&...
తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3న ప్రారంభం కానున్నాయని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది కానీ.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. గవర్నర్ పై కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. హైకోర్టులో పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి త...
ఈనెల 27 న నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఆరోజు కుప్పంలో చికిత్స చేసి రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. అక్కడికి వెళ్లాక ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. తారకరత్నను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు. నిన్న ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా వెళ్లారు. తారకరత్న...
అంతర్జాతీయ క్రికెట్ కు ఇండియన్ క్రికెటర్ మురళీ విజయ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ కెరీర్ లో మురళీ విజయ్ మొత్తం 87 మ్యాచులు మాత్రమే ఆడాడు. అలాగే 4490 రన్స్ చేశాడు. అత్యధికంగా చూసుకుంటే టెస్టు మ్యాచుల్లో మురళీ విజయ్ 61 మ్యాచులు ఆడాడు. టెస్ట్ మ్యాచుల్లో మొత్తం 3982 రన్స్ చేశాడు. ప్రస్తుతం అతని సగటు 38.29గా ఉంది. తాను క్రికెట్ కు వీడ్...