nandamuri ramakrishna speaks about tarakaratna health
ఈనెల 27 న నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఆరోజు కుప్పంలో చికిత్స చేసి రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. అక్కడికి వెళ్లాక ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. తారకరత్నను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు. నిన్న ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా వెళ్లారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా.. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడిందని నందమూరి రామకృష్ణ స్పష్టం చేశారు. తారకరత్నను పరామర్శించడానికి వెళ్లిన రామకృష్ణ ఆయన్ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అవయవాలన్నీ పనిచేస్తున్నాయని, ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్ పై ఉన్నారన్నారు. న్యూరాలజిస్ట్ అబ్జర్వేషన్ లో తారకరత్న ఉన్నారు. ఎక్మో పెట్టలేదు.. అది అవాస్తవం అని రామకృష్ణ వెల్లడించారు.