తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3న ప్రారంభం కానున్నాయని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది కానీ.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. గవర్నర్ పై కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. హైకోర్టులో పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గవర్నర్ ఇంకా బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపలేదు. ప్రస్తుతం గవర్నర్ తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. తాజా పరిణామాలతో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని మార్చి వచ్చే నెల 3కి బదులుగా 6న తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.