తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈనేపథ్యంలో రాజ్ భవన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. గవర్నర్ తమిళిసైని మంత్ర ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్థికశాఖ కార్యదర్శి, అసెంబ్లీ సెక్రటరీ కూడా కలిశారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి పొసగడం లేదు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. రాజ్ భవన్ లో తమిళిసై ఒక్కరే జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జెండాను ఆవిష్కరించి పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లి అమరులకు నివాళులు అర్పించి వచ్చేశారు. కనీసం ప్రభుత్వం తరుపున రిపబ్లిక్ డే వేడుకలను కూడా జరపలేదు. మరోవైపు సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లోనూ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.