నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బులెటిన్ విడుదలైంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి సోమవారం తాజాగా బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నాడని వెల్లడించారు. అయితే తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఇప్పటి వరకూ కూడా తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అస్సలు అందించలేదని వెల్లడించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. డాక్టర్లు అందించిన సమాచారాన్ని అభిమానులకు అందజేస్తున్నారు. తారకరత్న ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా తెలియజేస్తామని నారాయణ హృదయాలయ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రజలెవరూ తారకరత్నను చూసేందుకు రావొద్దని, చికిత్సకు అంతరాయం కలగకుండా తమకు సహకరించాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తారకరత్నను చూసేందుకు ఇప్పటికే కుటుంబీకులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్ లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.