»Kurnool Avinash Reddy Mother Health Is Stable Health Bulletin Update
Kurnool మెరుగైన అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం.. మరి తర్వాత జరిగేది ఏంటి..?
ఇక సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు తల్లి పేరిట నాటకమాడుతూ విచారణ నుంచి తప్పించుకున్నది చాలని స్పష్టం చేశారు. వెంటనే విచారణకు వెళ్లాలని.. కర్నూలును ఖాళీ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) నాలుగు రోజులుగా సీబీఐ విచారణకు (Investigation) హాజరుకాకుండా తప్పించుకుంటున్నారు. తల్లి అనారోగ్యం పేరిట కర్నూలులోని (Kurnool) ఆస్పత్రిలో తిష్ట వేశారు. కాగా.. అవినాశ్ తల్లి ఆరోగ్యం మెరుగు పడింది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.
ఈనెల 19వ తేదీన నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సీబీఐ విచారణకు హాజరుకావాల్సిన అవినాశ్ తల్లికి అస్వస్థతకు గురయ్యారని హైదరాబాద్ (Hyderabad) నుంచి హుటాహుటిన కర్నూలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ రోజు పులివెందులలోని బాకరాపురంలోని నివాసంలో అవినాశ్ తల్లి లక్ష్మికి గుండెనొప్పి వచ్చింది. స్థానికంగా ప్రాథమిక వైద్యం అనంతరం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో (Viswa Bharati Hospital) చేర్పించారు. వారం రోజులుగా ఆ ఆస్పత్రి కేంద్రంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
ఏది ఏమైనా అవినాశ్ తల్లి ఆరోగ్యం మెరుగైందని (Health Condition) ఆస్పత్రి హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేసింది. ‘లక్ష్మి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సీసీయూలో చికిత్స కొనసాగుతోంది. అల్ట్రా స్కాన్ (Ultra Scan)లో పురోగతి కనిపించింది. మూడు రోజుల నుంచి కోలుకుంటున్నారు. వాంతులు తగ్గుముఖం పట్టాయి. సాధారణ గదికి ఆమెను తరలించాలని అనుకుంటున్నాం’ అని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.
కాగా తల్లి ఆరోగ్యం మెరుగవడంతో ఇక సీబీఐ (CBI) విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు తల్లి పేరిట నాటకమాడుతూ విచారణ నుంచి తప్పించుకున్నది చాలని స్పష్టం చేశారు. వెంటనే విచారణకు వెళ్లాలని.. కర్నూలును ఖాళీ (Vacat) చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, తల్లి అనారోగ్యం మెరుగవడంతో మరోసారి సీబీఐ విచారణకు నోటీసులు (Notice) అందించే అవకాశం ఉంది.