»Nandamuri Taraka Ratna Dashadina Kharma Poster His Parents Names Missing
Nandamuri Taraka Ratna: తారకరత్న దినకర్మ పోస్టర్ వైరల్..కనిపించని వారి పేర్లు!
నందమూరి తారకరత్న(Nandamuri Taraka Ratna) గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న(Tarakaratna) ఫిబ్రవరి 18న శివరాత్రి రోజు కన్నుమూశారు. తారకరత్న(Tarakaratna)ను బతికించుకోవడానికి కుటుంబీకులు విదేశాల నుంచి వైద్యులను రప్పించినా లాభం లేకుండా పోయింది. తారకరత్న మృతి తర్వాత ఆసక్తికర సంఘటనలు జరిగాయి.
నందమూరి తారకరత్న(Nandamuri Taraka Ratna) గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న(Tarakaratna) ఫిబ్రవరి 18న శివరాత్రి రోజు కన్నుమూశారు. తారకరత్న(Tarakaratna)ను బతికించుకోవడానికి కుటుంబీకులు విదేశాల నుంచి వైద్యులను రప్పించినా లాభం లేకుండా పోయింది. తారకరత్న మృతి తర్వాత ఆసక్తికర సంఘటనలు జరిగాయి. తారకరత్న మరణించిన తర్వాత ఆయన మృతదేహాన్ని హైదరాబాద్(Hyderabad)లోని ఆయన నివాసం మోకిలాకు తీసుకొచ్చారు. అయితే తారకరత్న(Tarakaratna) తల్లిదండ్రులు అక్కడకు రాకపోవడంతో చర్చనీయాంశమైంది.
నందమూరి కుటుంబీకులతో పాటు ఇతర సెలబ్రిటీలు, బంధువులు అందరూ మోకిలాకు వచ్చి తారకరత్న(Tarakaratna)కు నివాళులు అర్పించారు. కానీ తారకరత్న తండ్రి మోహనకృష్ణ, ఆయన భార్య శాంతి మాత్రం కొడుకును చివరిసారిగా చూడ్డానికి రాలేదు. అభిమానుల సందర్శనార్థం తారకరత్న(Tarakaratna) పార్థీవదేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించగా ఆ సమయంలో మాత్రం తారకరత్న తల్లిదండ్రులు వచ్చి తమ కుమారుడిని కడసారి చూసుకున్నారు.
తారకరత్న(Tarakaratna)ను ఫిలిం ఛాంబర్ వద్ద చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా తల్లిదండ్రులు నిర్వహించారు. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా తారకరత్న అలేఖ్యరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. దాంతో వారు తారకరత్నను దూరం పెట్టినట్లు సమాచారం. కొన్నేళ్ల నుంచి తల్లిదండ్రులు తారకరత్న(Tarakaratna)ను దూరం పెడుతూనే వస్తున్నారు. అందుకే కన్నకొడుకును చూసేందుకు మోకిలాకు రాలేదని సన్నిహితులు చెబుతున్నారు. మోకిలాలో తారకరత్న నివాసం ఉంటున్న ఇల్లు ఆయన భార్య అలేఖ్యారెడ్డి తరపు వాళ్లది కాబట్టి వారు అక్కడికి రాలేదని సమాచారం. అయితే సన్నిహితులు మాత్రం అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేస్తున్నారు.
తాజాగా తారకరత్న(Tarakaratna) దినకర్మకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. మార్చి 2న పెద్దకర్మను ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. తారకరత్న దినకర్మ పోస్టర్లో నందమూరి బాలకృష్ణ, విజయసాయి రెడ్డి పేర్లను వేశారు. కానీ తారకరత్న తల్లిదండ్రుల పేరు మాత్రం వేయలేదు. దీంతో మరోసారి తారకరత్న(Tarakaratna) తల్లిదండ్రుల విషయం చర్చనీయాంశమైంది. అయితే సన్నిహితులు మాత్రం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, దినకర్మ నాడు వారు వచ్చి జరగాల్సిన కార్యక్రమాలు జరిపిస్తారని అంటున్నారు.