చాలా ప్రాంతాల్లో తల్లి తదనందరం ఆమె ఆస్తిపాస్తుల కంటే కూడా ఆమె నగలు ఎవరికి చెందాలి అనేదానిపై చాలా గొడవలు జరుగుతుంటాయి. నిజానికి మనం కలి యుగంలో ఉన్నాం. మనిషి చనిపోకముందే.. వాళ్ల ఆస్తులు, అంతస్తులు, బంగారం ఇతరత్రా గురించి ముందే డిస్కస్ చేసుకునే కాలంలో ఉన్నాం. చాలా ఇంట్లో ఇది జరిగేదే. తల్లి మరణించిన తర్వాత ఆమె నగలు ఎవరికి చెందాలి అనేది ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్ కాదు.. చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నదే. కొన్ని ప్రాంతాల్లో కూతుళ్లకు చెందుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో కూతురికి చెందుతుంది. అది అక్కడి సంప్రదాయాలను బట్టి నడుస్తుంది.
కానీ.. ఇక్కడ మనం చూడాల్సింది ఒకటుంది. అది మానవత్వ కోణం. అసలు తల్లిని వృద్ధాప్యంలో ఎవరు చూసుకున్నారు అనేదే ముఖ్యం. అందుకే దీనికి చట్టం పరిధి చూడాలి.. సంప్రదాయాలు చూడాలి.. అలాగే మానవత్వ కోణాలు కూడా చూడాలి. చట్ట ప్రకారం చూస్తే మాత్రం తల్లి తదనంతరం ఆమె ఆస్తిపాస్తులు ఖచ్చితంగా ఆమెకు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ సమానంగా చెందాలి. ఆమెకు కొడుకులు, కూతుళ్లు ఎంత మంది ఉంటే అంత మంది సమానంగా పంచుకోవాలి.
బంగారం మాత్రమే కాదు.. ఈరోజుల్లో ఆస్తులు కూడా కొడుకులతో పాటు సమానంగా కూతుళ్లకు కూడా చెందాలని చట్టాలు చెబుతున్నాయి. కానీ.. చట్టప్రకారం ఎవరూ నడుచుకోరు. ఒకవేళ ఇక్కడ సంప్రదాయాన్ని చూస్తే కొడుకు, కోడలుకే చెందాలి. ఎందుకంటే.. తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తనను చూసుకొని, కంటికి రెప్పలా కాపాడుకునేది కొడుకు, కోడలే. కూతురు ఎప్పుడో ఒకసారి వచ్చి తల్లిని చూసి వెళ్తుంది కానీ.. తల్లికి సేవ చేసేది మాత్రం అల్టిమేట్ గా కొడుకు, కోడలే. ఒకవేళ తల్లికి కొడుకు లేకపోతే అప్పుడు కూతురే తనకు సేవ చేస్తే ఓకే. కానీ.. పెళ్లి అయితే కూతురు అత్తారింటికి వెళ్తుంది. దీంతో తల్లిని చూసుకునే అవకాశం కూతురుకు అన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు.
ఈ విషయంలో తల్లి నిర్ణయం కూడా చూసుకోవాలి. మరోవైపు తన మానవత్వ కోణం చూసుకుంటే తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇతర సందర్భాల్లో తనను ఎవరు చూసుకున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ మధ్య కొందరు తల్లిదండ్రులను ఎక్కువగా పట్టించుకోవడం లేదు. అందుకే.. తల్లిదండ్రులను కొడుకులు పట్టించుకోవడం లేదని, చివరి దశలో ఎవరు తల్లిని చూసుకుంటే వారికే చెందాలని అంటుంటారు. అది కూడా కరెక్టే కదా. శేష జీవితంలో తల్లిని ఎవరు బాగా చూసుకుంటే వారికే తన బంగారం చెందడం కరెక్ట్. ఇలా.. ఎవరి ఇంట్లో అయినా వారి పరిస్థితులు అన్నింటినీ చూసుకొని తల్లి తదనంతరం ఆమె బంగారం ఎవరికి చెందాలి అనేదానిపై పెద్దలు ఒక నిర్ణయానికి వస్తే తల్లి తదనంతరం కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఆ కుటుంబం సఖ్యతతో ఉండొచ్చు.