• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రైతన్నలకు ఎరువుల అవస్థలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని రైతులు ఉదయం నుంచి లైన్‌లో నిలబడి తిండి తిప్పల్లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు మూడు రోజుల నుంచి వచ్చిన గాని ఒక యూరియా బస్తా దొరకని పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అనేక పాట్లు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం రైతుల బాధలు అర్థం చేసుకొని వారికి యూరియా బస్తాలను అందజేయాలని కోరుకుంటున్నారు.

August 28, 2025 / 05:41 PM IST

HYD జంట జలాశయాలకు పెరిగిన వరద

TG: హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. ఉస్మాన్‌సాగర్ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం ఇన్‌ఫ్లో 1,600 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,404 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఈ జలాశయం ఇన్‌ఫ్లో 2,500 ఉండగా, ఔట్‌ఫ్లో 2,300 క్యూసెక్కులుగా ఉంది.

August 28, 2025 / 05:40 PM IST

వ్యతిరేక దిశలో ప్రయాణం ప్రమాదకరం: ఎస్సై

కోనసీమ: జాతీయ రహదారులపై వ్యతిరేక దిశ ప్రయాణం ప్రమాదకరమని, ఎక్కువ ప్రమాదాలు ఈ ప్రయాణంతోనే జరుగుతున్నాయని ఆలమూరు ఎస్సై జి. నరేష్ అన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ సెంటర్ నుంచి మడికి సెంటర్ వరకు జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో ప్రయాణించే వాహనదారులకు అవగాహన కల్పించారు. అలాంటి వాహనాలపై అపరాధ రుసుం విధించారు.

August 28, 2025 / 05:40 PM IST

దోపిడీలకు పాల్పడిన ముఠా అరెస్ట్

ATP: బస్సుల్లో ప్రయాణికులను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్. సుమతి, ఎస్. గీత, ఎస్. రంజిత్, ఎస్. బృంద అనే మహిళలను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి నుంచి రూ. 23 లక్షలు విలువైన 242.5 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

August 28, 2025 / 05:40 PM IST

బూర్జలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

SKLM: బూర్జ మండలం డొంకలపర్త సచివాలయ పరిధిలోని హరిపురం, పల్లాపురంలో కాలువల్లో పేరుకుపోయిన పూడికలును ఇవాళ తొలగించారు. ఈ కార్యక్రమం పంచాయతీ సెక్రెటరీ మురళీ ఆధ్వర్యంలో జరిగింది. పరిసరాలను పరిశుభ్రతతో ప్రజలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉందని మురళీ అన్నారు. వర్షకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ఉన్నారు.

August 28, 2025 / 05:39 PM IST

సచివాలయంలో సమీక్ష నిర్వహించిన CM

GNTR: రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. క్వింటాలుకు రూ. 1200 చెల్లించి రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

August 28, 2025 / 05:37 PM IST

జోరుగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా

ASF: జిల్లా రెబ్బెన మండలంలో గోలేటి క్రాస్ వద్ద గల వాగులో జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొట్టుకొచ్చిన ఇసుకను అక్రమంగా వ్యాపారులు తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి ఇసుక తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

August 28, 2025 / 05:36 PM IST

కనకమహాలక్ష్మి ఆయలంలో ఏయూ వీసీ

VSP: విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీ.వీ.జీ.డీ. ప్రసాద రెడ్డి తన కుటుంబంతో కలిసి శ్రీ కనకమహాలక్ష్మి గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

August 28, 2025 / 05:35 PM IST

కాలువ గండ్లను పూడ్చిన తెలుగు యువత అధ్యక్షుడు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేవుని చెరువు కట్టు కాలువకు గండ్లు పడ్డాయి. దీంతో చెరువులోని నీరు యాదవుల బజారులోని ఇళ్ల వైపు ప్రవహించడం ప్రారంభించింది. ఈ సమస్యను వెంటనే గుర్తించిన తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్, గురువారం జేసీబీ సహాయంతో కట్టు కాలువ గండ్లను పూడ్చివేశారు.

August 28, 2025 / 05:34 PM IST

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ

VZM: చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ ప్రాంగణంను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్‌ను తనిఖీ చేసి, స్టేషను ప్రాంగణంలో పార్కింగు చేసి ఉన్న వాహనాలు గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన సంబంధిత వ్యక్తులకు అప్పగించాలని ఆదేశించారు.

August 28, 2025 / 05:33 PM IST

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

HNK: వర్షాల నేపథ్యంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సుష్మా అన్నారు. గురువారం పరకాల మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలోని పలు కాలనీల్లో కమిషనర్ పర్యటించి ప్రజలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు.

August 28, 2025 / 05:33 PM IST

మండపాలను సందర్శించిన బత్యాల చంగల్ రాయుడు

అన్నమయ్య: రైల్వేకోడూరు పట్టణంలోని కొత్తబజార్, నరసరాంపేట వినాయక మండపాలను గురువారం మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు సందర్శించారు. ఇందులో భాగంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు స్థానికులు శాలువాలు, పూలమాలలతో ఘన సత్కారం చేసి, తీర్థ ప్రసాదం అందజేశారు.

August 28, 2025 / 05:32 PM IST

‘ఆదివాసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు’

ASR: అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఈమేరకు హుకుంపేట మండలం మజ్జివలస గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రాజెక్టు వ్యతిరేక సభ, భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల భూమి, అడవుల జోలికి వస్తే తరిమి కొడతామని హెచ్చరించారు.

August 28, 2025 / 05:32 PM IST

వరద ఉధృతినీ పరిశీలించిన కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గురువారం జీ. కొండూరు మండలం హెచ్. ముత్యాలంపాడు బ్రిడ్జి వద్ద రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులతో కలిసి వరద ఉధృతి పరిస్థితిని పరిశీలించారు. అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లోలేవాల్ బ్రిడ్జిపై నుండి ప్రవాహం వెళ్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

August 28, 2025 / 05:32 PM IST

పాఠశాలల్లో 80% హాజరు శాతం ఉండాలి

KNR: ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం 80 శాతం దాటాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్, కేజీబీవీ ప్రిన్సిపాళ్లతో గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాశాఖపై సమీక్షించారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

August 28, 2025 / 05:31 PM IST