అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని మసాపేట, గాలివీడు రోడ్డు, మదనపల్లె రోడ్డులలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనను సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పలు వీధులలో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ప్రధాన రహదారిపై చిరు వ్యాపారులు వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి అమ్మకాలు జరిపారు. బుధవారం వ్యాపారం ముగిసిన తర్వాత, వారు తమ వ్యర్థాలను అక్కడే వదిలి వెళ్లడంతో రహదారి ఇరువైపులా చెత్తాచెదారం పేరుకుపోయింది. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
NRML: భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వర్ణ ప్రాజెక్టును పరిశీలించారు. వరద నీటి ఇన్ ఫ్లో, అవుట్‌ఫ్లో పరిస్థితులను అధికారులతో చర్చించి, ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
NRML: నిర్మల్ పట్టణంలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలో వర్షం నీరు నిలిచిపోయింది. పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పరిశీలించారు. కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాల పట్ల పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు.
NZB: నిజాంసాగర్ ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు నిజాంసాగర్ మండల పరిధిలోని మరుపల్లి గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. మరిన్ని గేట్లను ఎత్తేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉన్న మరుపల్లి గ్రామం ప్రజలను నిజాంసాగర్ మండల కేంద్రానికి తరలించారు.
KMR: జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో జిల్లాకు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 3-4 గంటల్లో బిక్కనూర్, కామారెడ్డి, డొమకొండ, రాజంపేట మండలాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి, నిజాంసాగర్, బాన్సువాడ, పిట్లం మండలంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలో పేర్కొన్నారు.
HNK: శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పత్తిపాక, ప్రగతి సింగారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను బుధవారం DMHO అప్పయ్య సందర్శించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రతిరోజు 25 ఇళ్లను సందర్శించడం, డ్రైడేపట్ల అవగాహన కలిగించాలన్నారు. టెస్టింగ్ కిట్లు, మందులు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు.
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 29న పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ, నోవోటెల్లో ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్, రాధిసన్లో గ్రిఫిన్ మీటింగ్ జరిగే వేదికలను పరిశీలించారు. పోలీస్ కమిషనర్‌తో భద్రతా చర్చ జరిపారు. అధికారులకు సూచనలు జారీ చేసి కంపెనీలతో సమన్వయం కుదుర్చాలని ఆదేశించారు.
KRNL: వినాయక చవితి సందర్భంగా కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో వినాయకున్ని ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహించారు. మేయర్ బీవై రామయ్య, కమిషనర్ పీ.విశ్వనాథ్ హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నగర ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, వినాయకుడు అన్ని అడ్డంకులను తొలగించి శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ATP: రాయదుర్గం పట్టణంలోని సర్కిల్ వద్ద కొలువు తీరిన గణనాథుడిన్ని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యుల పిలుపు మేరకు బుధవారం సాయంత్రం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
WGL: జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి వర్షం దంచి కొడుతోం.ఈ నెల 27న ఉ.8:30 నుంచి సా.4 వరకు 107.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 30.5 మి.మీ. వర్షం కురిసింది. దుగ్గొండి 23.8, ఖానాపూర్ 15.3 నమోదైంది. అతి తక్కువగా ఖిల్లా వరంగల్ మండలంలో 0.5 మి.మీ. నమోదైంది.
RR: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మజీద్ మామిడిపల్లి గ్రామంలో శివలింగం అనే వ్యక్తికి మంజూరైన రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బుధవారం ఎమ్మెల్సీ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర వైద్య సహాయార్థం సీఎంఆర్ఎఫ్ సేవలను వినియోగించుకోవాలన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో నిత్యం వాహన రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రధానంగా మద్ది ఆలయం దాటిన తరువాత నుంచి తడికలపూడి వరకు రహదారి దెబ్బతింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. దానికి తోడు వర్షాలు పడడంతో గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోయాయి.
TG: మాజీమంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ‘కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మీలా మేం ఇంట్లో కూర్చోలేదు.. ప్రజల్లో ఉన్నాం’ అని భట్టి పేర్కొన్నారు. ‘బీజేపీతో కేటీఆర్ స్నేహం బయటపడింది. బీజేపీ వ్యతిరేకంగా మేం బిహార్ వెళ్లినందుకు.. కేటీఆర్‌కు బాధ కలుగుతోంది’ అంటూ విమర్శించారు.
NLG: నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘మీల్స్ ఆన్ వీల్స్’ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా, వినాయక చవితి పండుగ రోజున రోగుల సహాయకులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆహార స్టాల్ నిర్వాహకుల సహకారంతో పౌష్టికాహారం (చద్దన్నం) పంపిణీ చేశారు.