• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రహదారికి మరమ్మతులు చేపట్టండి’

BDK: మణుగూరు నుంచి బీటీపీఎస్ బయ్యారం క్రాస్ రోడ్ వరకు ఉన్న రోడ్డు దారుణమైన స్థితిలో ఉన్నదని, దాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ రోడ్డు మీదుగా పినపాక, కరకగూడెం, గుండాల, ములుగు, ఏటూరు నాగారం వంటి ప్రాంతాలకు నిత్యం ప్రయాణం చేస్తుంటారు. అనేకమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

August 28, 2025 / 06:09 PM IST

రేపు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు గురువారం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజాదర్బారును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

August 28, 2025 / 06:08 PM IST

తెలుగు భాష దినోత్సవం మన గౌరవానికి ప్రతీక: ఎంపీ

NLR: తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదని, తెలుగు జాతి గర్వకారణం, ఆత్మీయత, భారతీయ సంస్కృతికి వెలుగునిచ్చే అద్దమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ అన్నారు. తెలుగు మహా కవి, భాషా సంరక్షకుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఏటా ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు.

August 28, 2025 / 06:08 PM IST

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

VSP: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను గురువారం ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే. మయూర్ అశోక్, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జీఎం హనుమా నాయక్ పాల్గొన్నారు.

August 28, 2025 / 06:08 PM IST

‘విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పెంపొందించాలి’

MHBD: విద్యార్థినీ విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలపై ఫోకస్ చేసి హాజరు శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, DEO ఏ. రవీందర్ రెడ్డి, స్పెషల్ అధికారులు కెజివీబీ, ప్రోగ్రాం అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు.

August 28, 2025 / 06:06 PM IST

బాల్యవివాహాలపై అవగాహన సదస్సు

ELR: నూజివీడు పట్టణంలోని ఆర్ఆర్‌పేట‌లో ఇవాళ బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అనూష మాట్లాడుతూ.. బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్యవివాహాలతో ఏర్పడే అనర్ధాలను వివరించారు. ఐసీడీఎస్, సీడీపీవో పిల్లి విజయకుమారి, సూపర్వైజర్ ధనలక్ష్మి పాల్గొన్నారు.

August 28, 2025 / 06:06 PM IST

చౌడూరు గ్రామంలో హెల్త్ క్యాంపు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం చౌడూరు గ్రామంలో గురువారం హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ సందర్భంగా రీజనల్ వ్యాధులపై నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలన్నారు.

August 28, 2025 / 06:05 PM IST

ప్రజాప్రతినిధులతో ముగిసిన పవన్ భేటీ

AP: జనసేన ప్రజాప్రతినిధుల సమావేశం ముగిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి జనసేన కేడర్‌తో సమన్వయంపై ఆరా తీశారు. కేడర్‌కు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలని సూచించారు.

August 28, 2025 / 06:05 PM IST

బస్సు షెల్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని నరసరావుపేట రోడ్డుపై ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద శివశక్తి లీలా , అంజన్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన కొత్త బస్సు షెల్టర్‌ను వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ.. శివశక్తి ఫౌండేషన్ ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అని పేర్కొన్నారు.

August 28, 2025 / 06:02 PM IST

ఈ నెల 30న కాకినాడలో జాబ్ మేళా

KKD: కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. అపోలో ఫార్మసీ, టాటా ఏఐఏ, న్యూ ఇన్నోలెర్న్ సంస్థల్లో 123 ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయన్నారు. 18-35 సంవత్సరాల వయసు గల టెన్త్ నుంచి డిగ్రీ అర్హత ఉన్నవారు తమ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు.

August 28, 2025 / 06:00 PM IST

అభివృద్ధికి నీతి ఆయోగ్ నిధులు.. అధునాతన భవన నిర్మాణం ప్రారంభం

GDWL: గట్టు మండల అభివృద్ధికి నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ పథకంలో 1 కోటి రూపాయల నిధులు మంజూరైన నేపథ్యంలో, అధునాతన భవన నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. గురువారం గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

August 28, 2025 / 06:00 PM IST

ఆకట్టుకుంటున్న చెఫ్ వినాయకుడు

ATP: జిల్లాలోని గణేష్‌ మండపాల్లో విభిన్న రూపాల్లో వినాయకులు పూజలందుకుంటున్నారు. అనంతపురంలోని నేరుగంటి వీధిలో చెఫ్ వినాయకుడిని కొలువుదీర్చారు. వినూత్నంగా ఉన్న ఈ గణపతి భక్తులను ఆకట్టకుంటున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని ఫొటోలు దిగుతున్నారు. కాగా.. ఈ ఏడాది పట్టణంలో వందల సంఖ్యలో గణనాథులను ఏర్పాటు చేశారు.

August 28, 2025 / 06:00 PM IST

గ్రామంలోని కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలింపు

KMM: సత్తుపల్లిలో వరద ఉదృతి నేపథ్యంలో కొత్తూరు గ్రామంలోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో సత్తుపల్లి సీఐ శ్రీహరి గురువారం గ్రామాన్ని సందర్శించి 15 కుటుంబాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పునరావాస కేంద్రానికి సురక్షితంగా తరలించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు సీఐ తెలిపారు.

August 28, 2025 / 05:58 PM IST

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఇన్‌ఛార్జ్

ప్రకాశం: యర్రగొండపాలెం TDP కార్యాలయంలో గురువారం ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 21 మందికి రూ. 18 లక్షలు విలువచేసే చెక్కులను పంపిణీ చేసినట్లు ఎరిక్షన్ బాబు తెలిపారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోరాదని ఆయన పేర్కొన్నారు.

August 28, 2025 / 05:54 PM IST

BREAKING: రైతులకు ప్రభుత్వం శుభవార్త

AP: రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి కేంద్రం 10,350 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. దీంతో వారం రోజులు ముందుగానే ఏపీకి యూరియా దిగుమతి కానుంది. విశాఖ గంగవరం పోర్ట్‌లో దిగుమతికి కేంద్రం అంగీకారం తెలిపింది. అంతేకాకుండా వచ్చేనెల మొదటివారంలో కాకినాడ పోర్ట్‌కు మరో 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అవనుంది. 

August 28, 2025 / 05:53 PM IST