• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రీసిటీ-ఐమాప్ పరిశ్రమచే కంప్యూటర్లు వితరణ

TPT: శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో స్థానిక ఐమాప్ పరిశ్రమ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పుత్తూరు మండలంలోని పిల్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు 7.5 లక్షలు విలువచేసే 15 కంప్యూటర్లు వితరణ చేసింది. ఇందులో భాగంగా కంప్యూటర్లు వితరణ పట్ల కళాశాలల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

August 28, 2025 / 06:16 PM IST

శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో కంప్యూటర్లు వితరణ

TPT: శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో స్థానిక ఐమాప్ పరిశ్రమ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పుత్తూరు మండలంలోని పిల్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు 7.5 లక్షలు విలువచేసే 15 కంప్యూటర్లు వితరణ చేసింది. ఇందులో భాగంగా కంప్యూటర్లు వితరణ పట్ల కళాశాలల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

August 28, 2025 / 06:16 PM IST

‘గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి’

KRNL: గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. ఇవాళ ఆదోని పట్టణంలో నిమజ్జనం వెళ్లే వినాయక ఘాట్ ప్రధాన దారులను తనిఖీ చేసి పరిశీలించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. నిమజ్జనంకు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. 

August 28, 2025 / 06:15 PM IST

రానున్న 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

SRPT: తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజూర్‌నగర్ పట్టణ CI రాజు అన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేప‌థ్యంలో రానున్న 48 గంటలు, జాగ్రత్తలు పాటించాలని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం, ఎగువ ప్రాంతంలో కురిసే వర్షాలతో వచ్చే వరద నీటి ఉధృతి న‌దులతో పాటు చెరువులకు వరద నీరుపోటెత్తే అవ‌కాశం ఉందన్నారు

August 28, 2025 / 06:14 PM IST

విద్యాశాఖపై కలెక్టర్ త్రిపాఠి సమీక్ష

NLG: పాఠశాలలో విద్యార్ధులందరూ కనీస అభ్యాసన సామర్ధ్యాలు సాధించే విదంగా ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. విద్యార్థులకు అందాల్సిన సౌకర్యాలను సకాలంలో అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఆమె గురువారం డీఈవో బిక్షపతితో జిల్లాస్థాయి విద్యా విషయక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల ముఖ హాజరును సమీక్షించారు

August 28, 2025 / 06:14 PM IST

బీసీ సంక్షేమ అధికారిగా సయ్యద్ అక్బర్ పాషా

GDWL: జోగులాంబ గద్వాల జిల్లా నూతన బీసీ సంక్షేమ అధికారిగా సయ్యద్ అక్బర్ పాషా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు సూర్యాపేట జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేసిన ఆయనకు పదోన్నతి లభించడంతో గద్వాల జిల్లాకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

August 28, 2025 / 06:13 PM IST

జిల్లాలో పింఛన్‌లు తొలగింపుపై.. నిరసనలు

NLR: సంగం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ఇవాళ పింఛన్‌లు తొలగింపు పై వైసీపీ నేతలు నిరసన చేశారు. మండలంలో దాదాపుగా 105 తొలగించినట్లు వారు తెలియజేశారు. తొలగించిన పింఛన్‌లను తిరిగి కొనసాగించాలని, వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసులో అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

August 28, 2025 / 06:12 PM IST

జగన్ పాపాలు పండే రోజు వస్తుంది: మంత్రి కొల్లు

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.  రెడ్ బుక్ తాము తెచ్చింది కాదని.. ప్రజలే ఇచ్చారని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ పాపాలు పండే రోజు వస్తుందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై సంతోషంగా ఉన్నారని చెప్పారు.

August 28, 2025 / 06:12 PM IST

చిత్తూరులో మహిళా దొంగలు అరెస్ట్

CTR: బస్సుల్లో ప్రయాణికులను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఆ జిల్లా ఎస్పీ జగదీశ్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్.సుమతి, ఎస్.గీత, ఎస్.రంజిత్, ఎస్.బృంద‌ను అరెస్ట్ చేశామని చెప్పారు. అనంతరం వారి నుంచి రూ.23 లక్షలు విలువైన 242.5 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

August 28, 2025 / 06:12 PM IST

తవణంపల్లెలో CMRF చెక్కుల అందజేత

CTR: తవణంపల్లె మండలం ఈచనేరికి చెందిన ఇద్దరు సీఎం సహాయ నిధి(CMRF)కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున ఇద్దరికి రూ.లక్ష మంజూరైంది. ఈ మేరకు సంబంధిత చెక్కులను టీడీపీ నేత కృష్ణమ నాయుడు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి నాయుడు, యువరాజు స్వేరో, అనిల్ కుమార్, యుగంధర్, కృష్ణమ్మ పాల్గొన్నారు.

August 28, 2025 / 06:11 PM IST

‘పటిష్ఠంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలి’

ప్రకాశం: ఒంగోలు రూరల్ పరిధిలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలను జేసీ గోపాలకృష్ణ సందర్శించారు. డీఎస్సీ-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పటిష్ఠంగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట డీఈవో కిరణ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

August 28, 2025 / 06:11 PM IST

‘మాతృభాషతోనే మనుగడ సాధ్యం’

కోనసీమ: మాతృభాష సంరక్షణతోనే తెలుగుజాతి మనుగడ సాధ్యమవుతుందని ఆలమూరు మండల విద్యాశాఖ అధికారి భమిడిపాటి అప్పాజీ అన్నారు. గురువారం సంధిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ శ్రీ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. తెలుగు భాష పట్ల విద్యార్థి దశ నుంచే శ్రద్ధ చూపించాలని విద్యార్థులకు సూచించారు.

August 28, 2025 / 06:10 PM IST

విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: విజయవాడలో దుర్గమ్మ అమ్మవారిని, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ముందుగా అర్చకులు మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది అమ్మవారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.

August 28, 2025 / 06:10 PM IST

పార్కెలగండిలో వర్షానికి కూలిన ఇల్లు

BDK: దమ్మపేట మండలం పార్కలగండి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి సున్నం నాగబాబు ఇల్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి ఆ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వరద నీరు ఇళ్లల్లోకి చేరుతున్నాయని, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

August 28, 2025 / 06:10 PM IST

ఓయూలో ఫలితాలు విడుదల

HYD: ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల రెండో సెమిస్టర్, రెగ్యులర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలను వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలన్నారు.

August 28, 2025 / 06:09 PM IST