• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈనెల 30న తిరుపతిలో జాబ్ మేళా

TPT: ఈనెల 30న తిరుపతిలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి లోకనాథం తెలిపారు. జాబ్ మేళాలో 12 బహుళ జాతీయ కంపెనీలు 400కు పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే యువతి యువకులు రిజిస్ట్రేషన్ లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు.https://naipunyam.ap.gov.in/user-registration.

August 26, 2025 / 07:24 PM IST

‘రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి’

E.G: ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని రైతు సాధికార సంస్థ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ అన్నారు. అనపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. డ్రమ్ సీడర్ విత్తనాలు పిచికారీ చేసే విధానాన్ని పరిశీంచారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మాధవ్ రావు పాల్గొన్నారు.

August 26, 2025 / 07:24 PM IST

మండపాలను సందర్శించిన డీఎస్పీ

కోనసీమ: మండపేట మండలం ఇప్పన పాడులో ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపాన్ని మంగళవారం రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి పండగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ పి.దొర రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

August 26, 2025 / 07:23 PM IST

పొగాకు కొనుగోలు ఆగకూడదు – జెసి భార్గవ్ తేజ ఆదేశాలు

GNTR: గుంటూరు జిల్లాలో రైతుల వద్ద నుండి పొగాకు కొనుగోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలు కూడా రైతుల వద్ద కొనుగోళ్లు కొనసాగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

August 26, 2025 / 07:22 PM IST

గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

NGKL: జిల్లా ప్రజలకు గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా మంగళవారం కలెక్టర్ బదావత్ సంతోష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, పరస్పర సహకారంతో, స్నేహభావంతో ఈ ఉత్సవాలను జరుపుకోవాలని ఆయన కోరారు. గణనాథుడి కృపతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

August 26, 2025 / 07:22 PM IST

బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే భవిష్యత్తు బంగారం: ఎస్పీ

GNTR: విద్యార్థులు బాధ్యతాయుతంగా మెలిగితేనే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం వట్టిచెరుకూరు కిట్స్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్, ర్యాగింగ్, మాదక ద్రవ్యాల వినియోగంపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను తెరవరాదని సూచించారు. డ్రగ్స్ వాడకం జీవితాలను నాశనం చేస్తాయన్నారు.

August 26, 2025 / 07:21 PM IST

చవితి ఉత్సవాలపై సబ్ కలెక్టర్ సూచనలు

ELR: నూజివీడు డివిజన్‌లో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, ధ్వని కాలుష్యం లేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

August 26, 2025 / 07:21 PM IST

PVNR ఎక్స్ ప్రెస్ హైవేపై యాక్సిడెంట్..!

HYD: మెహదీపట్నం నుంచి ప్రారంభమయ్యే PVNR ఎక్స్ ప్రెస్ హైవేపై యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కారు అద్దాలు ధ్వంసం అయినట్లు పోలీసులు తెలిపారు. ఆరంఘర్ వైపు వెళ్లే మార్గంలో కాస్తంత ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ప్రస్తుతానికి క్లియర్ చేయడం కోసం శ్రమిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

August 26, 2025 / 07:21 PM IST

నానో యూరియాతో పర్యావరణానికి ప్రయోజనం

SRD: నానో యూరియా వాడడం వల్ల పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. చౌటకూర్‌లో నానో యూరియాపై అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇఫ్కో సంస్థ నానో యూరియాను తయారుచేసి రైతులకు అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు. దీనివల్ల పంటల దిగుబడి పెరుగుతుందని తెలిపారు.

August 26, 2025 / 07:20 PM IST

‘6 గ్యారంటీలు అమలు చేయాలి’

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ వర్గల్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు రూ.4,000 పింఛన్, మహిళలకు రూ.2,500 భృతి ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

August 26, 2025 / 07:19 PM IST

పార్కింగ్ స్థలం కాదు ఇది.. ప్రధాన వీధి ఇది

PDPL: గోదావరిఖని పట్టణంలోని ప్రధాన వీధిలో ఇలా ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడంతో రాకపోకలకు నిత్యం అంతరాయం ఏర్పడుతుంది. లక్ష్మీనగర్ వ్యాపార కేంద్రంలోని అంబికా ఆసుపత్రి గల్లీలో నిత్యం ఇదే తంతు కనిపిస్తుంది. షాపులకు సంబంధించిన యజమానుల వాహనాలతో పాటు మరికొందరి వాహనాలు ఇక్కడే గంటల కొద్ది ఇలా పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి.

August 26, 2025 / 07:19 PM IST

‘భారీ వ‌ర్షాలపట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి’

VZM: భారీ వ‌ర్షాల ప‌ట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమంగా ఉండాలని క‌లెక్ట‌ర్‌ అంబేద్క‌ర్ ఆదేశించారు. బుధ‌వారం జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్ర‌స్తుత‌ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని, ఎక్క‌డా ఎటువంటి న‌ష్టం జ&zw...

August 26, 2025 / 07:16 PM IST

దర్గాను దర్శించి, ప్రత్యేక పూజలు చేసిన DCP

JN: జిల్లాలోని హజ్రత్ అబ్దుల్లా బాబా దర్గాలో ఉర్స్ సందర్భంగా జిల్లా డీసీపీ రాజా మహేందర్ నాయక్, SHO దామోదర్ రెడ్డిలు మంగళవారం దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు చేసి చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో జమాల్ షరీఫ్, ముస్లిం డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు, దర్గా ముతవల్లి సయ్యద్ హబీబ్ పాల్గొన్నారు. అనంతరం డీసీపీ, SHOలను శాలువతో సత్కరించారు.

August 26, 2025 / 07:16 PM IST

TU అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి: AISF

NZB: తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని AISF జాతీయ అధ్యక్షుడు విరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం AISF తెలంగాణ యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో TUలో ఆయన మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

August 26, 2025 / 07:15 PM IST

పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్

MDK: సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. పాపన్నపేట పీహెచ్సీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు పట్టిక, OP రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. గ్రామాలలో జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

August 26, 2025 / 07:14 PM IST