• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రీ సర్వేలో అభ్యంతరాలు ఉంటే తెలపండి’

పబ్లికేషన్ చేసిన రీ సర్వేలో రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని భీమడోలు తహసీల్దార్ రమాదేవి అన్నారు. శనివారం భీమడోలు మండలం సూరప్పగూడెంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. సూరప్పగూడెంలో రీ సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

August 23, 2025 / 06:35 PM IST

ప్రాథమిక పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం

SRCL: చందుర్తి మండలం, నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా “భారతీయ వ్యోమగాముల ఫోటో ప్రదర్శన” ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. జలంధర్ రెడ్డి గారు భారతీయ వ్యోమగాముల గొప్పతనం గురించి వివరించారు. ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించే భారతీయ అంతరిక్ష కార్యక్రమాలు వాటి విజయాలను, ఉపయోగాలను వివరించారు.

August 23, 2025 / 06:35 PM IST

‘అధిక యూరియా వాడితే పంటకు నష్టం’

KDP: అధిక యూరియా వాడకం వల్ల పంటలకు లాభం కన్నా నష్టమే ఎక్కువ కలుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్ర నాయక్ రైతులకు తెలిపారు. శనివారం ప్రొద్దుటూరులో పలు దుఖానాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికంగా రసాయనిక ఎరువులు వాడకం వల్ల పంటలకు మేలు కలిగించే వాన పాములు లాంటివి కనుమరుగుతున్నాయని అన్నారు.

August 23, 2025 / 06:35 PM IST

కాశపోగు సుధా రాణికి డాక్టరేట్

GDWL: జిల్లాలోని ఎర్రవల్లి మండలం యక్తాపూర్ గ్రామానికి చెందిన కాశపోగు సుధా రాణికి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 84వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టా శనివారం లభించింది. గవర్నర్ సమక్షంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ చేతుల మీదుగా ఆమె ఈ పట్టాను అందుకున్నారు. ఈ ఘనత సాధించడంలో తన తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందని ఆమె అన్నారు.

August 23, 2025 / 06:34 PM IST

‘రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం’

W.G. పెనుమంట్ర మండల పాలమూరు గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో 30 విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ పాల్గొని మాట్లాడారు. రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవికుమార్, బ్లడ్ బ్యాంక్ ఇంఛార్జ్ పెండ్యాల సూర్య పాల్గొన్నారు.

August 23, 2025 / 06:33 PM IST

‘లక్ష్య సాధన పై విద్యార్థులకు అవగాహన సదస్సు’

PDPL: మంథని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మానవ హక్కులు, అక్రమ రవాణా, తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. టోల్ ఫ్రీ నంబర్లు 1098, 181, డయల్ 100ల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం సైకాలజిస్ట్ అమ్మ ఆనంద్ ఒత్తిడి, భావోద్వేగాలను అధిగమించి జీవిత లక్ష్యాలను సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆలోచన విధానాలపై పలు సూచనలు చేశారు.

August 23, 2025 / 06:32 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవలు ద్వారా రూ.1,68,746 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 1260 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 20 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 1960 మంది స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు.

August 23, 2025 / 06:31 PM IST

శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరగాలి: DCP

MDCL: మల్కాజిగిరి జోనల్ రాచకొండ DCP పద్మజా శనివారం సీపీ సుధీర్ బాబు నిర్వహించిన జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే గణపతి ఉత్సవాల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ లాంటి అంశాలపై పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరగాలని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.

August 23, 2025 / 06:31 PM IST

సగ్గుబియ్యంతో బోలెడు ప్రయోజనాలు

సగ్గుబియ్యంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వంటి సమస్యలకు సగ్గుబియ్యం జావ ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయి. ఎముకలు, కండరాలు బలంగా మారుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు సగ్గుబియ్యాన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. నరాల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. యాంగ్జైటీ, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి.

August 23, 2025 / 06:30 PM IST

ఏసీబీకి చిక్కిన డోర్నకల్ సీఐ

MHBD: జిల్లా డోర్నకల్ సీఐ భూక్య రాజేశ్ ఏసీబీకి చిక్కాడు. ఓ కేసులో బెయిల్ మంజూరు చేయడానికి బెల్లం వ్యాపారి కుమారుడి నుంచి రూ.50,000 లంచం డిమాండ్ చేయగా, బాధితుడు రూ.30,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

August 23, 2025 / 06:30 PM IST

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఐజీ

VZM: వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి విజయనగరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ను శనివారం సందర్శించారు. టౌన్ డీఎస్పీ డీఐజీ స్వాగతం పలికి పుష్ప గుచ్చం అందించారు. అనంతరం సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను, సీసీ టీవీ పనితీరును పరిశీలించి, సీఐకు పలు సూచనలు చేశారు.

August 23, 2025 / 06:30 PM IST

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే

KKD:పెద్దాపురం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

August 23, 2025 / 06:29 PM IST

‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి’

KNR: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ దిశగా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ పథకం అమలుపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

August 23, 2025 / 06:28 PM IST

డిగ్రీ కళాశాలలో క్లైమేట్‌ యాక్షన్‌ డే

W.G: క్లైమేట్‌ యాక్షన్‌ డే కార్యక్రమాన్ని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ కళాశాలలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్‌ ఏడుకొండలు అధ్యక్షతన జరిగింది. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. కాలుష్యం తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, చిన్న చిన్న అలవాట్లలో మార్పులు తీసుకుంటే పర్యావరణానికి పెద్ద సహాయం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు.

August 23, 2025 / 06:28 PM IST

‘పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం’

GNTR: సామాజిక ప్రయోజనాల కోసం మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందామని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాలుర వసతి గృహాల చీఫ్ వార్డెన్ ఆచార్య కె.మల్లికార్జున అన్నారు.పర్యావరణం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా శనివారం యూనివర్సిటీ బాలుర వసతి గృహాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

August 23, 2025 / 06:28 PM IST