ELR: పెన్షన్లు రద్దయిన వారికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ విజ్ఞప్తి చేశారు. 40% పైగా వికలాంగ శాతం ఉన్నప్పటికీ పెన్షన్ రద్దయిన పింఛనుదారులు 15 రోజుల్లోపు ఏలూరు జిజిహెచ్ హాస్పిటల్ మెడికల్ బోర్డుకు హాజరు కావాలన్నారు. అలాగే పెన్షన్ రద్దు చేసిన సర్టిఫికెట్, పాత పెన్షన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మెడికల్ బోర్డు అప్లికేషన్ సమర్పించాలన్నారు.
HNK: జిల్లాలో కాజీపేట పట్టణంలోని సయ్యద్ అఫ్టల్ బియభాని దర్గాలో ఉర్సు ఉత్సవాలు మూడో రోజైన శనివారం ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు దర్గాను సందర్శించి, ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
BHPL: మహదేవపూర్ మండలం కాలేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానానికి ఈ శ్రావణమాసంలో ఆదాయం తగ్గినట్లు ఆలయ అధికారులు శనివారం తెలిపారు. ఈ ఏడాది రూ.38.60 లక్షల ఆదాయం సమకూరగా, గతేడాది రూ.52 లక్షలు వచ్చినట్లు తెలిపారు. మే నెలలో జరిగిన సరస్వతి పుష్కరాలకు భక్తులు అధికంగా రావడం శ్రావణమాస ఆదాయంపై ప్రభావం చూపినట్లు వెల్లడించారు.
NRML: జిల్లాలో మంజూరైన ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్,ఆయా పోస్టులకు శనివారం జిల్లా కేంద్రంలోని నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోడానికి బారులు తీరారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 13 ప్రీ ప్రైమరీ, ఆయా పోస్టులు మంజూరయ్యాయని, అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
SRPT: నూతనకల్ మండల మాజీ జడ్పీటీసీ కందాల దామోదర్ రెడ్డిని ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో సూర్యాపేటలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సామేలు కలిసి పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు సామ అభిషేక్ రెడ్డి, గుడిపల్లి మధుకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వీరస్వామి ఉన్నారు.
NTR: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన వీధులలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
CTR: వినాయక చవితి వేడుక నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ కత్తి శ్రీనివాసులు శనివారం బంగారుపాల్యం మండలం టేకుమంద గ్రామంలో తనిఖీలు చేపట్టారు. సిబ్బందితో కలిసి గ్రామంలోని అనుమానాస్పద ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. ట్రబుల్ మేకర్స్, రౌడీ షీటర్లుకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.
TPT: చిల్లకూరు, కోట మండలం చిట్టేడులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెల 25వ తేదీ పింక్ బస్ క్యాంపులు నిర్వహిస్తామని డాక్టర్లు షాలోమ్ అరాఫత్, జి.నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు స్విమ్స్ ఆధ్వర్యంలో బీపీ, షుగర్తో పాటు నోటి, రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తామని చెప్పారు. ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ తీసుకుని రవాలన్నారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం కాతేరు పంచాయతీ శాంతినగర్లోని బీజేపీ శ్రేణులతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇవాళ సమావేశం అయ్యారు. వచ్చే నెల 1వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ‘సారథ్యం’ పేరిట ప్రారంభం కానున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీలు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు.
కృష్ణా: మోపిదేవి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న పోలిమెట్ల స్వయంప్రభ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించారు. స్వయంప్రభ ఎస్ఏ – సోషల్‌లో 76.94 మార్కులతో జిల్లా ఇరవైవ ర్యాంకు సాధించి బీసీ-ఏ కోటాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించారు. ప్రభుత్వ టీచర్ పోస్ట్ సాధించాలనే ఆకాంక్ష కూటమి ప్రభుత్వంలో నెరవేరటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
KRNL: వెల్దుర్తి మండలం రాములకోట గ్రామంలో గ్రామ కార్యదర్శి రాధిక ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలో ర్యాలీ నిర్వహించి అధికారులు, నాయకులు ప్రజలకు ప్రతిజ్ఞ చేయించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. సచివాలయ పరిధిలో ఎంపీడీవో సుహాసినమ్మ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. AICC సెక్రటరీ విశ్వనాథన్ అధ్యక్షతన ఇంఛార్జ్ మంత్రులు సమావేశం అయ్యారు. ఈ భేటీకి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఇంఛార్జ్ ఛైర్మన్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించే వ్యూహంపై చర్చించారు.
GDWL: రాబోయే గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని అయిజ ఎస్సై శ్రీనివాసరావు కోరారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ పోలీస్ స్టేషన్‌లో శానివరం ఆయన ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని మతాల పెద్దలను ఆహ్వానించి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగలను సంతోషంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
TG: ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై BJP ఆరోపణలు చేయడం బాధాకరమని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సుదర్శన్ రెడ్డి ఆదరణను జీర్ణించుకోలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సుదర్శన్ రెడ్డి ప్రగతిశీల భావాలు గల ప్రజాస్వామ్యవాది అని పేర్కొన్నారు. ఆయనకు అందరూ మద్దతివ్వాలని కోరారు.
TG: కూకట్‌పల్లిలో బాలిక హత్య కేసు వివరాలను సీపీ మహంతి, డీసీపీ సురేష్ వెల్లడించారు. ఈనెల 18న ఈ హత్య జరిగిందని, నిందితుడు కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టించాడని తెలిపారు. బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్లానని నిందితుడు చెప్పాడని, కానీ అసలు డబ్బు గురించే అతను మాట్లాడడం లేదని పేర్కొన్నారు. బాలిక అడ్డుకోగా పారిపోయేందుకు ప్రయత్నించి హత్య చేశాడని చెప్పారు.