• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

GDWL: మల్దకల్ మండలం బిజ్వరం గ్రామానికి చెందిన బోయ కాకి వెంకటేష్ అనే యువకుడు పరుమాల గ్రామంలోని చెరువు వద్ద ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం చూస్తుంటే ఆత్మహత్య జరిగి చాలా రోజులు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

October 8, 2025 / 05:55 PM IST

అక్రమంగా గంజాయి సరఫరా.. నలుగురు అరెస్ట్

BHPL: మల్హర్రావు మండలం జంగిడిపల్లి గ్రామంలో ఆదివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని, 3.335 కిలోల గంజాయిని సీజ్ చేశారు. గంజాయి విలువ రూ.1.50 లక్షలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. రెండు బైకులు, రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

September 1, 2025 / 08:51 AM IST

బంగారం వ్యాపారి మిస్సింగ్.. కేసు నమోదు

SKLM: నరసన్నపేట బంగారు వ్యాపారి మిస్సింగ్ కేసును నమోదు చేశామని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. నరసన్నపేట లోని లచ్చుమన్న పేటకు చెందిన పొట్నూరు గుప్తా గత నెల 26వ తేదీన కారులో బంగారం నగదుతో విశాఖపట్నం బయలుదేరారు. విశాఖ వెళ్లిన తర్వాత డ్రైవర్‌ను వెనక్కి పంపించిన ఆయన ఇంతవరకు ఇంటికి చేరకపోవడంతో కేసు నమోదు చేశారు.

September 1, 2025 / 08:50 AM IST

మణుగూరులో వాగు ఉద్ధృతి.. ప్రయాణాలు వద్దు

BDK: మణుగూరు వాగు మల్లారం వద్ద బ్రిడ్జిపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో అటువైపు ప్రయాణాలు చేయవద్దని తహసీల్దార్ అద్దంకి నరేశ్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాత్రి వేళల్లో ఆ మార్గంలో ప్రయాణించడం సురక్షితం కాదని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

September 1, 2025 / 08:49 AM IST

సోమశిల జలాశయంలో 62 టీఎంసీల నీరు నిల్వ

నెల్లూరు: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. సోమవారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 62.650 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజా ప్రకటనలో పేర్కొన్నారు. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 500 క్యూసెక్కులు, కావలి కెనాల్‌కు 850 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

September 1, 2025 / 08:48 AM IST

నేటి నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

SRD: సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల శిక్షణా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ ప్రావీణ్య శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఎంపికైన వంద మందికి ఐదు నెలల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

September 1, 2025 / 08:45 AM IST

కంభం చెరువుకు భారీగా వరద నీరు

ప్రకాశం: కంభం మండలంలోని కంభం చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గొలుసు కట్టు చెరువులు నిండి, నీరు కంభం చెరువుకు చేరుతోంది. దీంతో స్థానికులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఆయకట్టుపై ఆధారపడిన రైతులు ఈసారి పంటల సాగుకు నీరు సమృద్ధిగా ఉందని సంబరపడుతున్నారు.

September 1, 2025 / 08:45 AM IST

సాత్నాల ప్రాజెక్టు తాజా సమాచారం

ADB: సాత్నాల ప్రాజెక్టు తాజా వివరాలను AEE దీపక్ సోమవారం తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 మీటర్లకు గాను ప్రస్తుతం 286.10 మీటర్లుగా ఉందన్నారు. నీటి సామర్థ్యం 1.24 TMCలకు ప్రస్తుతం 0.959 TMC ఉందన్నారు.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కారణంగా గడించిన 24 గంటల్లో 251 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని, ప్రస్తుతం 363 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు.

September 1, 2025 / 08:42 AM IST

కల్వర్టుపై రోడ్డు అధ్వానం

VKB: దుద్యాల మండలం హకీంపేట్ శివారులోని కల్వర్టుపై రోడ్డు అధ్వానంగా మారింది. కోస్గి పట్టణానికి వెళ్లే రోడ్డు మార్గంలో కల్వర్టుపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలతో ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతుల కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

September 1, 2025 / 08:40 AM IST

గణేష్ విగ్రహం వద్ద అట్టహాసంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం

SRPT: కోదాడ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ 30వ వార్డులో శ్రీ రామ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, ఆదివారం రాత్రి గణేష్ విగ్రహం వద్ద లక్ష దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. అనంతరం గణేష్ విగ్రహం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

September 1, 2025 / 08:40 AM IST

తాడేపల్లిగూడెం సీపీఐ సీనియర్ నేత మృతి

W.G: తాడేపల్లిగూడెం సీపీఐ మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సీపీఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ పూడి సుబ్బారావు ఆదివారం రాత్రి వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. సుబ్బారావు భార్య గతంలోనే మృతి చెందారు. ఈయన పట్టణ సీపీఐ నాయకులు. రెండు సార్లు పార్టీ తరపున మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈయన మృతి పట్ల జిల్లా సీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

September 1, 2025 / 08:38 AM IST

‘ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలి’

JGL: ప్రతిఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ లత అన్నారు. ఆదివారం జిల్లాలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో శాశ్వత బియ్యం దాతల సమావేశాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ లత హాజరై మాట్లాడారు. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా చక్కటి వసతి, భోజనం ఇతర సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు.

September 1, 2025 / 08:38 AM IST

‘ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాలు చేయాలి’

JGL: ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాలు చేయాలని కొడిమ్యాల ఎస్సై సందీప్ సూచించారు. ఆదివారం కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని వినాయకుని మండపాలను ఎస్సై సందీప్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులను కోరారు.

September 1, 2025 / 08:34 AM IST

పింఛన్లు పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్

ప్రకాశం: కనిగిరి పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దివ్యాంగులు, వితంతువులకు, అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు కనిగిరి మున్సిపల్ కమీషనర్ కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బి. సి కాలనీ, శివనగర్ కాలనీలో, కొత్తూరు తదితర ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కమీషనర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు ప

September 1, 2025 / 08:33 AM IST

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

NLG: చిట్యాల మండలం మేడిలో గొర్రెల దొడ్లపై కుక్కలు దాడి చేయడంతో ఆరు గొర్రెలు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బైకాని లింగస్వామి, ఏర్పుల రామనర్సింహకు చెందిన గొర్రెల దొడ్లపై  కుక్కలు దాడి చేశాయి. బైకాని లింగస్వామికి చెందిన 4 మేకలు, ఏర్పుల రామనర్సింహకు చెందిన 2 గొర్రెలు మృతిచెందాయి. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

September 1, 2025 / 08:33 AM IST