VZM: చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ ప్రాంగణంను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్‌ను తనిఖీ చేసి, స్టేషను ప్రాంగణంలో పార్కింగు చేసి ఉన్న వాహనాలు గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన సంబంధిత వ్యక్తులకు అప్పగించాలని ఆదేశించారు.