MDCL: 100% ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాల్సిందేనని సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన కిందిస్థాయి అధికారులకు, స్వచ్ఛ ఆటో కార్మికులకు సూచించారు. ఏమాత్రం తేడా వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుండ్ల పోచంపల్లిలో పర్యటించి, చెరువు పరిసరాల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్స్, గుర్రపు డెక్క తొలగింపు పై ఫోకస్ చేయాలన్నారు.
BHPL: TGలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో 22 లక్షల మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని TRP మొగుళ్లపల్లి (M) అధ్యక్షులు రాజేష్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని, ఫీజు ఒత్తిడితో ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలన్నారు.
JN: జఫర్గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు, ‘మా ఇల్లు’ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య తండ్రి గాదె సాల్మోన్ రెడ్డి (97) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి MLA హరీష్ రావు, తొలి ఉపముఖ్యమంత్రి రాజయ్య ఇన్నయ్య నివాసానికి వెళ్లి ఆయన తండ్రి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో, జిల్లా వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని, జాతీయ రహదారులు, ఆర్&బీ రహదారుల వెంట మొక్కలు నాటి, వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ ప్రాణస్నేహితుల పెళ్లిలో వీరిద్దరూ సందడి చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో పంచుకున్న వివాహ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్నేహితుల బంధం, వేడుకలోని వీరి ఉత్సాహం అభిమానులను ఆకట్టుకుంటోంది.
న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు. జనవరి నెలకు గాను ‘ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో నిలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్, ఇంగ్లండ్ స్టార్ జో రూట్‌ను వెనక్కి నెట్టి మిచెల్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. కాగా, మహిళల విభాగంలో బంగ్లాదేశ్ ప్లేయర్ శోభన మోస్తరీ ఈ అవార్డును దక్కించుకుంది.
ADB: విద్యార్థులు శాస్త్రీయంగా రాణించాలని ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్ అన్నారు. సర్. సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని బేల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్ర సాంకేతిక కృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కృష్ణకుమార్ పేర్కొన్నారు.
KMR: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం పిట్లం మండలంలో పర్యటించారు. మండలంలోని బుర్నాపూర్ గ్రామానికి వెళ్తున్న క్రమంలో పిట్లం చేరుకున్న ఆయనకు జిల్లా అధికార యంత్రాంగం స్వాగతం పలికింది. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఛైర్మన్‌కు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు.
MLG: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ పై వివాదం చిరరేగింది. అయితే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 7 రోజుల ముందు నోటీసు ఇవ్వకుండా, ఒక రోజు ముందు వాట్సాప్, మైకు ద్వారా సమాచారం ఇచ్చారని యువత ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు గ్రామసభ దగ్గరికి వెళ్లగా.. పాలకవర్గం లోపలే మీటింగ్ పెట్టుకుని సభ వాయిదా వేసిందని విమర్శించారు.
RR: చేవెళ్ల మున్సిపల్ నూతన ఛైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ బండారి శైలజ ఆగిరెడ్డిలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎర్ర గోపాల్ యాదవ్, నరేందర్ రెడ్డి శాలువతో సన్మానించారు. మునిసిపల్ అభిరుద్దికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, టేకులపల్లి శ్రీనివాస్, యాదవ్, అశోక్, నరేష్, ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు.
TPT: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం హిస్టరీ, బాటనీ పేపర్–II పరీక్షలు శనివారం నిర్వహించారు. జనరల్ కోర్సులో 5,033 మందికి గాను 4,930 మంది హాజరై, 103 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ కోర్సులో 1,090 మందికి గాను 1,058 మంది హాజరై, 32 మంది గైర్హాజరయ్యారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.
KNR: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ట్రాన్స్ కో ఆధ్వర్యంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రజలకు ఏమైనా విద్యుత్ సమస్య లుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వైర్లు తెగితే సిబ్బందితో రిపేర్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ దివాకర్ రావు, సబ్ ఇంజనీర్ నవీన్, సర్పంచ్ ముదాం రవి, ట్రాన్స్ కో సిబ్బంది పాల్గొన్నారు.
NTR: గంపలగూడెం మండలం తునికపాడు గ్రామంలో రామిశెట్టి సత్యంబాబు అనే లబ్ధిదారుడికి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 44,231 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలుస్తుందని తెలిపారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేసిందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆరోపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవి నగర్ మెయిన్ రోడ్డులో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
KMM: కల్లూరు మున్సిపాలిటీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ అధికారులను సూచించారు. శనివారం కల్లూరులో పర్యటించిన ఛైర్మన్ డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.