TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసును కోర్టు కొట్టేసిన నేపథ్యంలో BRS అధినేత, మాజీ సీఎం KCR కీలక వ్యాఖ్యలు చేశారు. కవితకు న్యాయం జరిగిందని, BRS కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఎప్పుడైనా చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు. లిక్కర్ కేసులో BJP కుట్ర పన్నిందని ఆరోపించారు. అలాగే, రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై KTRతో చర్చించినట్లు తెలుస్తోంది.
SDPT: చిన్నకోడూరు మండలంలోని మేడిపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బోధనలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
KRNL: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీకి అధికారులు, అర్చకులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ టీఏసీ సభ్యులు బత్తిన జీవన్ కుమార్, చంద్రశేఖర్ ఉన్నారు.
MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం మార్కెట్ రోడ్డులో ఫుట్‌పాత్‌లపై జరిగిన ఆక్రమణలను ట్రాఫిక్, మున్సిపల్, పోలీస్ అధికారులు సంయుక్తంగా తొలగించారు. రహదారిపై అనధికారికంగా ఏర్పాటు చేసిన షెడ్లు, వ్యాపార స్టాళ్లు, ఇతర వస్తువులను తొలగిస్తూ పాదచారులకు సౌకర్యవంతమైన మార్గం కల్పించారు. మార్కెట్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ చర్యలని అధికారుల తెలిపారు.
KRNL: మనేకుర్తి గ్రామంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ప్రెస్‌మీట్ ఇవాళ నిర్వహించారు. పేదలు,వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతి అర్హుడికి పారదర్శకంగా, సమయానికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమనిన్నారు.
తిరుపతి రూరల్ తనపల్లి వద్ద జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్టీసీ అధికారులు TPT సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి చిత్తూరు, కాణిపాకం, బెంగళూరు వెళ్లే బస్సులను దారి మళ్లించారు. ఇవి ఇకపై తిరుమల బైపాస్ రోడ్డు అలిపిరి–టౌన్ క్లబ్ మార్గంగా హైవేపైకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
BDK: ఏజెన్సీ ఏరియాలో గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని గోండ్వానా సంక్షేమ పరిషత్ చర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వరప్రసాద్ ఆరోపించారు. శనివారం కొయ్యూరు గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. చర్ల మండలం కేంద్రంలో ఏజెన్సీ చట్టాలను గిరిజనేతరులు అతిక్రమిస్తున్న అధికారులు మౌనం పాటిస్తున్నారని చెప్పారు.
పార్వతీపురం పట్టణంలోని 14 వార్డు గొల్ల వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇవాళ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పంపిణీ చేశారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల మొదటి తేదీన కూటమి ప్రభుత్వం పెన్షన్ల ఇస్తుందని తెలిపారు.
జైపూర్‌లో 400 ఏళ్ల నాటి ‘గులాల్ గోటా’ హోలీ సంప్రదాయం ప్రత్యేకమైనది. ఈ గులాల్ గోటాలను హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఇవి గాలిలో పగిలిపోతాయి. ప్లాస్టిక్ బెలూన్లలా కాకుండా పర్యావరణానికి అనుకూలమైనవి, హాని చేయవు. మణిహార్ కా రాస్తాకు చెందిన కళాకారులు ఈ లక్క గోటాలను తయారు చేస్తారు. వేడి నీటిలో లక్కను కరిగించి గాలి ఊది(ఫుంక్ని ద్వారా) సన్నని బంతులుగా తయారు చేస్తారు.
E.G: గ్రామీణ స్థాయి నుంచి ఆరోగ్య వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి ప్రతిష్ట పరచాలని, అప్పుడే అత్యవసర ప్రమాదాలను నివారించవచ్చని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ తెలిపారు. శనివారం రాజమండ్రిలో కల్తీ పాల వల్ల ప్రమాద బాధితులను పరామర్శించారు. కల్తీ పాల సంఘటనలో మరణించిన వారికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ATP: 10th పరీక్ష ఫీజు రూ.125 ఉండగా కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి రూ.500 నుంచి రూ.2000 వసూలు చేసినట్లు AISF జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి డీఈవో ప్రసాద్ బాబు ప్రైవేట్ కళాశాలల దోపిడీని అరికట్టాలని ఆయన వినతి పత్రం ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు.
సత్యసాయి: రాప్తాడు, ధర్మవరం చెరువులకు కృష్ణా జలాలందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హంద్రీనీవా నుంచి PABR కుడి కాలువను అనుసంధానించడం ద్వారా 49 చెరువులను నింపాలని నిర్ణయించారు. MLA పరిటాల సునీత విజ్ఞప్తి మేరకు రూ.4.50 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. 4.70 కి.మీ లింక్ కెనాల్ నిర్మాణం కోసం సర్వే నిర్వహించి, నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు.
VKB: జిల్లాలో నేషనల్ మిన్స్ కం మెరిట్స్ (NMMS) స్కాలర్‌షిప్‌కు 78 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పరీక్షకు 1,097 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 78 మంది ఎంపికయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ప్రభుత్వం స్కాలర్‌షిప్స్ అందించనుంది. ధ్రువీకరణ పత్రాలను ఉన్నతాధికారులకు పంపించేందుకు జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టారు.
NGKL: నెలరోజుల పని దినాలు కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ మార్చి 1వ తేదీ నుంచి స్పాట్ బిల్లర్స్ సమ్మెలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో స్పాట్ బిల్లర్ అసోసియేషన్ నాయకులు కల్వకుర్తిలోని విద్యుత్ ఎంప్లాయిస్ 327 యూనియన్ నాయకులు శ్రీధర్ చారి, శ్రీనివాస్ రాజు తదితరులకు శనివారం వినతి పత్రం అందజేశారు.