• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కరెంట్ సమస్యలపై సీఎండీకి కాల్

అన్నమయ్య జిల్లాలో లోవోల్టేజ్, అధిక బిల్లులు, కొత్త కనెక్షన్లు వంటి విద్యుత్ సమస్యలపై ‘డయల్ యువర్ CMD’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అధికారుల ప్రకారం వెంటనే చర్యలు తీసుకుంటారు.

March 2, 2026 / 12:07 PM IST

అర్హులైన వారికి ఇళ్ల పత్రాలు పంపిణీ

BDK: మణుగూరు మండలానికి చెందిన 14 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. పేదలకు గృహ వసతి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ పథకం అమలవుతోందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లభించడం ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు స్థిర నివాసం కలగడంతో పాటు జీవన స్థితి మెరుగుపడుతుంది అని అన్నారు.

March 2, 2026 / 12:07 PM IST

తాడేపల్లి గూడెం రూరల్ ఎస్సైగా రవికుమార్ బాధ్యతలు

W.G: తాడేపల్లిగూడెం రూరల్ SIగా ఎస్. రవికుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన భీమవరం ఐటీ, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ విభాగాల్లో పనిచేశారు. బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన జేవీఎన్. ప్రసాద్ ట్రాఫిక్ SIగా బదిలీ అయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన SI ఈ సందర్భంగా పేర్కొన్నారు.

March 2, 2026 / 12:05 PM IST

బంజారా కాలనీలో లక్ష్మీ జయంతి వేడుకలు

KMM: మధిర బంజారా కాలనీలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం లక్ష్మీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజారులు ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు చేశారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

March 2, 2026 / 12:05 PM IST

చిన్న పెండ్యాలను దత్తత తీసుకున్నకేంద్ర మంత్రి

JN: చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలో ఇటీవల జరిగిన GP ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచిన దివ్యాంగురాలు తిరుపతమ్మను ఇవాళ కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నపెండ్యాల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటేశ్వర్లు ఉన్నారు.

March 2, 2026 / 12:05 PM IST

జాతీయ స్థాయి ‘ప్రేరణ ఉత్సవ్’కు రెడ్డి సాయి ఎంపిక

అన్నమయ్య: రాజంపేట మండలం కొత్త బోయినపల్లి ZP హైస్కూల్ విద్యార్థి పట్నం రెడ్డి సాయి, గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించే ‘ప్రేరణ ఉత్సవ్’ అనే జాతీయ స్థాయి కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ ఉత్సవం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, భారతీయ సంస్కృతి, విలువలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్‌ఎం భారతి ఈ విషయాన్ని సోమవారం తెలిపారు.

March 2, 2026 / 12:05 PM IST

తాగునీటి సమస్య.. ప్రజల ఆందోళన

KKD: తొండంగి మండలం వలసపాకల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గత కొన్ని రోజులుగా సరైన నీటి సరఫరా లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలుమార్లు అధికారులకు తెలియజేసినా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 2, 2026 / 12:03 PM IST

జగ్గయ్యపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ. 10,10,281 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ తాతయ్య వారి నివాసంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటు అందిస్తుందని ఆయన అన్నారు.

March 2, 2026 / 12:03 PM IST

రేపు పత్తి మార్కెట్‌కు సెలవు..!

KNR:హోళీ పండుగను పురస్కరించుకుని రేపు జమ్మికుంట మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ప్రభుత్వ సెలవు కారణంగా మంగళవారం మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేయబడతాయని, తిరిగి బుధవారం నుంచి యథావిధిగా మార్కెట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు ఈ విషయాన్ని గమనించగలరు.

March 2, 2026 / 12:03 PM IST

‘ఛలో విజయవాడ విరమించాలి’

కోనసీమ: అంగన్‌వాడీలు ఛలో విజయవాడ విరమించాలని రావులపాలెం మండల TDP అధ్యక్షుడు కొప్పిశెట్టి ప్రసాద్ కోరారు. సోమవారం వెదిరేశ్వరంలో అంగన్‌వాడీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కేంద్రాల అప్‌గ్రేడ్, కొత్త సహాయకుల నియామకం చేపడుతుందని వివరించారు. ఈ పర్యటనలో పలువురు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

March 2, 2026 / 12:02 PM IST

వరంగల్ మార్కెట్ లో మిర్చి ధరలు ఇలా..!

WGL పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.21వేలు ధర పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.34 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,050, దీపిక మిర్చి రూ.29,500 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

March 2, 2026 / 12:02 PM IST

ఐసీయూలో మాజీ ఎమ్మెల్యేకు చికిత్స

ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సోమవారం ఉదయం ఐసీయూలో ఉన్న ఆయనను పరామర్శించారు. వైద్యులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

March 2, 2026 / 12:02 PM IST

యూరియా కోసం బీఆర్ఎస్ ధర్నా..

BHNG: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో భువనగిరి-చిట్యాల రహదారి ప్రక్కన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంటపొలాలకు సరిగ్గా యూరియా సరఫరా చేయడం లేదంటూ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డీమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 12:01 PM IST

నెల్లూరు ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

NLR: నెల్లూరు రూరల్ పరిధిలోని ఆటోనగర్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ నిల్వ ఉంచిన ప్లాస్టిక్ గోడౌన్‌లో మంటలు చెలరేగి, తాళాలు వేసి ఉండటంతో లోపల నుంచి భారీగా పొగ ఎగసిపడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు.

March 2, 2026 / 12:01 PM IST

పెట్రోల్ వినియోగదారులకు GOOD NEWS

ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్‌కు కనీసం 95 ఆక్టేన్ (RON) రేటింగ్ ఉండాలని కేంద్రం తప్పనిసరి చేసింది. 20% ఇథనాల్ బ్లెండింగ్ (E20) వల్ల ఇంధన నాణ్యత మెరుగుపడనుంది. ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ఆక్టేన్ స్థాయి 91-92 నుంచి 97-98 వరకు పెరుగుతుందని చమురు సంస్థలు తెలిపాయి. దీనివల్ల వాహన ఇంజన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది.

March 2, 2026 / 11:57 AM IST