నిర్మల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాలా (వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్) ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అసోసియేషన్ సభ్యులందరూ ఒకరికొకరు రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండగను శాంతియుతంగా, కేవలం సహజ సిద్ధమైన రంగులతోనే జరుపుకోవాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
VSP: విశ్వవిఖ్యాత పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం డోలోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవల అనంతరం స్వామివారిని మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకువచ్చారు. ముందుగా సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయంకు విచ్చేసిన స్వామివారికి వివాహ ప్రార్థనలు నిర్వహించారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో వెలిసిన హజరత్ యదుల్లా హ్ భాష ఖాద్రి ఉరుసు ఉత్సవాల సందర్భంగా రెండవ రోజు మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామ పురవీధుల గుండా స్వామి గంధాన్ని మేళ తాళాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దర్గాలో స్వామి వారికి గంధాన్ని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, చక్కర చదివింపులు చేశారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు అనుదీప్ KV రూపొందించిన ‘ఫంకీ’ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మార్చి 12 లేదా 13న స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
SRPT: ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో అమాయకులను ముంచుతున్న భారీ సైబర్ ముఠాను పోలీసులు ఛేదించారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు, ఆకుపాముల తదితర గ్రామాల్లో దాడులు నిర్వహించి 30 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో అధికార పార్టీ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి, నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
KNR: జిల్లా కలెక్టర్‌గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఆమె దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టినట్లు సింధు తాజాగా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొంది.
అన్నమయ్య: బోరెడ్డిగారిపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పలువురు మంత్రిని పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
KKD: అన్నవరం రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అధికారులు ప్లాట్‌ఫామ్‌పై టైల్స్ అమరిక, సమతలీకరణ పనులు చేపట్టారు. ఇందుకోసం ఇసుక మోట్లు, నిర్మాణ సామగ్రి ప్లాట్‌ఫామ్‌పై సిద్ధంగా ఉంచారు. భవిష్యత్తులో మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
VSP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 4న ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు అరకు (M) తంగుల్గూడాలోని రాధాకృష్ణ ఆలయంలో MLA రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుని రాణాప్రతాప్ నగర్‌లో మాజీ MLA వాసుపల్లి గణేశ్ నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
WNP: మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్‌లో కీలక పాత్ర పోషిస్తు నాడు సామాజిక సేవలో భాగస్వాములై, అభాగ్యులైన ఎందరికో మేమున్నామంటూ చేయుతనందించింది. నేడు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సందర్భంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, గనగాని శైలజ నర్సయ్య గౌడ్‌లకు శ్రీ రామలింగేశ్వర ఆలయ ఆవరణలో సన్మానం చేశారు.
ELR: హోలీ పండగ సెలవు రోజైన ఉంగుటూరు మండలంలో అధికారులు ఇంటి పన్ను కులాయి పన్ను వసూళ్లలో నిమగ్నమై ఉన్నారు. ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో మంగళవారం పెద్ద వెల్లమిల్లి, చిన వెల్లమిల్లి, చింతాయిగూడెం గ్రామాలలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను పరిశీలించారు. వెల్లమిల్లి గ్రామపంచాయతీ అభివృద్దికి అప్పారావు, సచివాలయం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ రక్షణ దినోత్సవం నేడు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే వీర జవాన్ల త్యాగాలను స్మరించుకునే రోజు ఇది. అచంచలమైన ధైర్యంతో నిరంతరం మనల్ని కాపాడుతున్న త్రివిధ దళాల సేవలు వెలకట్టలేనివి. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. శాంతిని కాంక్షిస్తూనే శత్రువుల ఆటకట్టించే మన రక్షణ వ్యవస్థకు సెల్యూట్ చేద్దాం. జై హింద్.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్‌లో బ్యారెల్ చమురు ధర 79.44 డాలర్లకు చేరుకుంది. నిన్న ఈ కాంట్రాక్టులు అత్యధికంగా 82.37 డాలర్లకు తాకినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.40 డాలర్లు తాకింది.
BPT: బాపట్ల విద్యా ప్రదాత కీర్తిశేషులు ముప్పలనేని శేషగిరిరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ, ఆయన కుమారుడు శేషు సుమంత్ కుమార్, అభిమానులు మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మకు వినతి పత్రం అందించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, త్వరలోనే విగ్రహ ఏర్పాటుకు తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.