• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

T20 WC ఫైనల్స్: భారత్‌దే రికార్డ్

సెమీస్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ T20 WCలో అత్యధింగా 4 సార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. ఇక అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన జట్ల లిస్టులో శ్రీలంక-పాక్(3) రెండో స్థానంలో ఉన్నాయి. అలాగే పాక్(2007 & 2019), లంక(2012 & 2014) తర్వాత వరుసగా రెండో సారి ఫైనల్స్‌కు చేరిన జట్టుగానూ భారత్(2025 & 2026 నిలిచింది.

March 6, 2026 / 11:59 AM IST

అదనపు కలెక్టర్‌ను కలిసిన మున్సిపల్ ఛైర్ పర్సన్

NRML: జిల్లాకు ఇటీవలే బదిలీపై వచ్చిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లును శుక్రవారం కలెక్టరేట్లో మున్సిపల్ ఛైర్ పర్సన్ అప్పాల కావ్య, అప్పాల గణేష్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పూల మొక్కను అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

March 6, 2026 / 11:57 AM IST

అది మర్చిపోలేని అనుభూతి: ప్రియాంక చోప్రా

మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం ‘వారణాసి’. ఈ మూవీలో భాగంగా కెన్యాలో జరిగిన షూటింగ్‌ను ప్రియాంక చోప్రా గుర్తుచేసుకుంది. కెన్యాలోని అడవుల్లో వేల సంఖ్యలో జింకలు వలస వెళ్తున్న సమయంలో, వాటి మధ్యలో నిలబడి షూటింగ్ చేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని పేర్కొంది. ప్రకృతి ఎంత శక్తిమంతమైనదో వాటిని చూస్తే తెలిసిందని ప్రియాంక చెప్పుకొచ్చింది.

March 6, 2026 / 11:56 AM IST

రెవెన్యూ డివిజన్‌గా కోడంగల్

VKB: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోని 8 మండలాలు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.​ దీనిని పరిష్కరిస్తూ, అన్ని మండలాలను ఒకే జిల్లా పరిధిలోకి తీసుకుని డివిజన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.

March 6, 2026 / 11:55 AM IST

‘మృత్యుంజయ్‌’ మూవీ రివ్యూ&రేటింగ్

శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా దర్శకత్వంలో ‘మృత్యుంజయ్‌’ ఇవాళ విడుదలైంది. ప్రమాదాలుగా చిత్రీకరించిన హత్యల వెనుక గుట్టును రిపోర్టర్ జయ్ ఎలా ఛేదించాడనేదే ఈ ప‌రిశోధ‌నాత్మ‌క థ్రిల్లర్ కథ. శ్రీవిష్ణు నటన, ద్వితీయార్ధంలో మైండ్ గేమ్ సినిమాకు బలం. కాలభైరవ సంగీతం ఉత్కంఠను పెంచింది. సాగదీత సీన్లు ఉన్నా, థ్రిల్లర్ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. రేటింగ్: 2.75/5

March 6, 2026 / 11:55 AM IST

శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్‌’ మూవీ రివ్యూ

శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా దర్శకత్వంలో ‘మృత్యుంజయ్‌’ ఇవాళ విడుదలైంది. ప్రమాదాలుగా చిత్రీకరించిన హత్యల వెనుక గుట్టును రిపోర్టర్ జయ్ ఎలా ఛేదించాడనేదే ఈ ప‌రిశోధ‌నాత్మ‌క థ్రిల్లర్ కథ. శ్రీవిష్ణు నటన, ద్వితీయార్ధంలో మైండ్ గేమ్ సినిమాకు బలం. కాలభైరవ సంగీతం ఉత్కంఠను పెంచింది. సాగదీత సీన్లు ఉన్నా, థ్రిల్లర్ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. రేటింగ్: 2.75/5

March 6, 2026 / 11:55 AM IST

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు

CTR: జీడీనెల్లూరు మండలంలో అంగన్వాడీ సహాయకురాల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ సీడీపీవో పద్మ సునంద శుక్రవారం తెలిపారు. మండలంలో ఓసీలకు 19, ఎస్సీలకు 3, బీసీలకు 3 పోస్టులు ఉన్నాయన్నారు. ఈనెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. వివరాలకు ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

March 6, 2026 / 11:51 AM IST

ఇకపై మండలం యూనిట్‌గా యూరియా పంపిణీ!

TG: రాష్ట్రంలో యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు వ్యవసాయ శాఖ యాప్‌లో కీలక మార్పులు చేస్తోంది. ప్రస్తుతం జిల్లా యూనిట్‌గా ఉన్న పంపిణీని, CM రేవంత్‌ ఆదేశాల మేరకు మండల లేదా నియోజకవర్గ స్థాయికి మార్చనున్నారు. దీనివల్ల రద్దీ తగ్గి, రైతులకు స్థానికంగానే ఎరువులు అందుతాయి. ప్రైవేటు డీలర్లపైనా నిఘా పెంచుతూ, పంపిణీని పారదర్శకం చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

March 6, 2026 / 11:50 AM IST

విధిగా శిరస్త్రాణం ధరించాలి: డీఎస్పీ

VZM: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. అందులో భాగంగా గురువారం ఎల్.కోట పోలీసు స్టేషన్ పరిధి విశాఖ-అరకు ప్రధాన రహదారిలో సిబ్బందితో కలిసి వాహన తనిఖీల్లో ఆయన పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు కళ్ళెం వేయడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విధిగా శిరస్త్రాణం ధరించాలని సూచించారు.

March 6, 2026 / 11:49 AM IST

ట్రాక్టర్ టిల్లర్ షాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: నార్కెట్‌పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ ట్రాక్టర్ టిల్లర్ షాప్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవ్వాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ యంత్రాలు రైతులకు అందుబాటులోకి రావడం వల్ల సాగు పనులు సులభతరం అవుతాయని పేర్కొంటూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

March 6, 2026 / 11:49 AM IST

పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

ASF: పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్ టెస్టు సద్వినియోగం చేసుకుని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని TSUTF ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి శుక్రవారం ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 5, 6 తరగతులు చదివే విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 15న పరీక్ష ఉంటుందని వివరించారు.

March 6, 2026 / 11:47 AM IST

డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు..!

అన్నమయ్య: తంబళ్లపల్లె RTC బస్టాండ్ వెనక వైపున డ్రైనేజీ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. డ్వామా PD వెంకటరత్నం ఆధ్వర్యంలో అధికారులు, కూటమి నాయకులు ఇవాళ భూమిపూజ చేశారు. రూ. 30 లక్షలతో పనులు చేస్తున్నామని ప్రత్యేక అధికారి రెడ్డెప్ప, PR డీఈ మునిరాజు కుమార్ తెలిపారు. నెలాఖరుకల్లా పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో APO అంజనప్ప, AE వెంకటరమణ, పాల్గొన్నారు.

March 6, 2026 / 11:46 AM IST

హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు భూమిపూజ

NRPT: నర్వ మండలంలోని లక్కర్ దొడ్డి, లంకాల గ్రామాల్లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు శుక్రవారం భూమిపూజ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పనులను ప్రారంభించారు. ఎంపీ నిధులతో లైట్లు ఏర్పాటు చేస్తున్నామని, దీంతో రాత్రి వేళల్లో గ్రామాల్లో వెలుగుల సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.

March 6, 2026 / 11:45 AM IST

మాదన్నపేటలో పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం

WGL: గత కొద్ది కాలంగా అపరిశుభ్రతతో ఇబ్బందులు పడుతున్న మాదన్నపేట కాలనీవాసుల విన్నపాలపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఇవాళ మున్సిపల్ సిబ్బంది గ్రామంలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, రోడ్లు, కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. దుర్వాసన తగ్గడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీవాసులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

March 6, 2026 / 11:45 AM IST

బైక్ చోరీ చేసిన నిందితుడి అరెస్ట్

BDK: బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర్‌లో గత నెల 26న చోరీకి గురైన బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లు శ్రావణ్ అనే వ్యక్తి తన బంధువుల ఇంటి వద్ద నిలిపిన హోండా షైన్ వాహనాన్ని అశ్వరావుపేటకు చెందిన నాగేంద్రబాబు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం నిందితుడిని పట్టుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.

March 6, 2026 / 11:45 AM IST