SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు బుధవారం ఎమ్మెల్సీ నాగ బాబు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ విశ్వక్సేన్, నాయకులు పాల్గొన్నారు.
WGL: రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ఒక రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన దొమ్మటి సాంబయ్య పేరు రాజ్యసభ రేసులో ముందుకు వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన పేరు అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
PDPL: ధర్మారం మండలం మేడారంలో బుధవారం శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. మహిళలు కోలాటాలు వేస్తూ డీజే పాటలకు నృత్యాలు చేస్తూ వైభవంగా ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన రహదారి గుండా చేపట్టిన ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్థానిక అధికారులకు రంగులు వేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం జిల్లా ప్రజలందరూ శాంతి సామరస్య పూర్వకంగా పండుగను నిర్వహించుకోవడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.
KNR: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద గొల్లపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలానికి చెందిన దాసరి సంపత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ని సీజ్ చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
MNCL: తాండూరు మండలం కిష్టంపేటకు చెందిన శాంత (28)కు బుధవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికమవ్వడంతో, ఈఎంటి శివకుమార్, పైలట్ తిరుపతి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. శాంత ఆడబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
VZM: ఎస్.కోట పరిధిలో శివరామరాజుపేట గ్రామానికి చెందిన పి.జగదీశ్వరరావు మెడికల్ షాపులో దొంగతనం జరిగింది. మెడికల్ స్టోర్స్ షట్టర్ తాళాలు పగులగొట్టి, లోపల ఉన్న రూ. 40,000 నగదును దుండగులు మంగళవారం రాత్రి అపహరించారు. బుధవారం ఉదయం యజమాని షాప్ తెరిచి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న పేట గ్రామం వద్ద ఓ కారు అదుపుతప్పి అందులో ఉన్న పురోహితుడికి ప్రాణాపాయం తప్పింది. గొల్లపల్లి గ్రామానికి చెందిన పురోహితుడు రఘురామ శర్మ తన కారులో రాజన్నపేట గ్రామానికి వెళ్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో పక్కనున్న చెట్టును ఢీకొట్టి పొలాల్లోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో రఘురామ శర్మ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.
NRML: మద్యానికి బానిసైన లింగన్న(48)అనే వ్యక్తి ముధోల్ మండల కేంద్రంలో మృతి చెందాడు. బుధవారం మద్యం తాగి భార్యతో డబ్బుల విషయంలో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయిన లింగన్న, గ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లె గుర్తించారు. ఫైర్ సిబ్బంది సహాయంతో బయటకు తీసే సమయానికి అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MNCL: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 6న CER క్లబ్‌లో మహిళలకు త్రోబాల్, బాంబ్ ఇన్ బ్లాస్ట్, ఆటల పోటీలు, గ్రూప్ డాన్స్ పోటీలు నిర్వహించనున్నట్లు మందమర్రి GM రాధాకృష్ణ బుధవారం ప్రకటనలో తెలిపారు. గెలుపొందిన విజేతలకు 8న బహుమతులు ప్రధానం చేయనున్నట్లు వివరించారు. ఉద్యోగుల భార్య, పిల్లలు, చుట్టుపక్కల గ్రామాల మహిళలు పాల్గొనాలని కోరారు.
JN: అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసిన వ్యక్తి పై కేసు నమోదు అయిన ఘటన పాలకుర్తి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఏసీఎస్ఓ జనగామ డిటిసిఎస్ లచ్చు నాయక్ ప్రకారం.. మండల కేంద్రంలో అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసి, రీఫిల్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేపట్టగా రుజువు కావడంతో రాజరాజేశ్వరి ఎంటర్ ప్రైజెస్ ఉప్పల శ్రీనివాసుపై 6ఏ కేసు చేశారు.
KMM: కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో మొక్కజొన్న, వరి పంటలను DAO పుల్లయ్య బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ.. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించిందని, ఈ పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 80 గ్రాములు ఎకరానికి పిచికారి చేయాలని సూచించారు. అనంతరం కూసుమంచిలో వాలంటీర్ల ద్వారా జరుగుతున్న డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేను పరిశీలించారు.
మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానిక ఎస్సై ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తుందని ఎస్పీ తెలియజేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎస్పీ వెంట మునగాల సీఐ, ఎస్సై ఉన్నారు.
SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన షార్ట్ వీడియోపోటీల విజేతలకు సీపీ రష్మీ పెరుమాళ్ బహుమతులు అందజేశారు. ప్రముఖ వినోద సంస్థ ‘వండర్లా’ ఉచిత ప్రవేశ కూపన్లను స్పాన్సర్ చేయగా.. వాటిని విజేతలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘షార్ట్ వీడియో కాంటెస్ట్ 2.0’ను ప్రారంభిస్తూ సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై వీడియోలు రూపొందించి యువత భాగస్వాములు కావాలని అన్నారు.
PDPL: కార్మిక కుటుంబాలకు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని, రామగుండం సింగరేణి సంస్థ GM లలిత్ కుమార్ అన్నారు. అధికారులతో కలిసి గోదావరి నది సమీపంలోని ఇంటెక్ వెల్‌ను పరిశీలించి మాట్లాడారు. మేడిపల్లి OCP నుండి నీటిని గంగానగర్ ఫిల్టర్ ఫిల్టర్ బెడ్‌కు పంపింగ్ చేస్తామని, OCP-5లో బోర్లు వేసి ఆ నీటిని సరఫరా చేస్తామన్నారు